ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరాకాష్ఠకు చేరిన పోలీసు దాడులు

ABN, First Publish Date - 2021-01-25T05:39:31+05:30

రాష్ట్రంలో అధికార పార్టీ నాయకుల అండ చూసుకుని పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని, అమాయకులపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని ఆర్యవైశ్య రాష్ట్ర నాయకుడు, టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1.  పోలిశెట్టి కనకరాజు కుటుంబానికి అండగా ఉంటాం
  2.  సోమిశెట్టి వెంకటేశ్వర్లు


కర్నూలు(అగ్రికల్చర్‌), జనవరి 24: రాష్ట్రంలో అధికార పార్టీ నాయకుల అండ చూసుకుని పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని, అమాయకులపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని ఆర్యవైశ్య రాష్ట్ర నాయకుడు, టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆరోపించారు. విశాఖపట్నం జిల్లా నర్సిపట్నం నియోజకవర్గంలోని గోలుగొండ మండలంలో ఏటిగైరంపేట రామాల యం ఘటనలో  69 ఏళ్ల వృద్ధుడు పోలిశెట్టి కనకరాజును పోలీసులు అక్రమ కేసులు బనాయించి 16 రోజులుగా రిమాండ్‌లో ఉంచడం అన్యాయమని అన్నారు. ఈ  సంఘటన గురించి తెలియగానే ఆదివారం ఆ కుటుంబాన్ని ఆర్యవైశ్య రాష్ట్ర నాయకులంతా అక్కడికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారని ఆయన అన్నారు. వారికి ఆర్యవైశ్య సంఘం  తరపున అండగా ఉంటామని, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని, భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్యవైశ్యుల మద్దతుతోనే  జగన్‌ ముఖ్యమంత్రి అయ్యారని, ఈ సంగతి ఆయన గుర్తించుకోవాలని సోమిశెట్టి స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైశ్య ప్రముఖులు డూండి రాఖేష్‌, నంద్యాల నాగేంద్రకుమార్‌, బంగారు రాజు, నాగేశ్వరరావు, సోమేశ్వరరావు, నారా సింగ్‌   పాల్గొన్నట్లు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు.  

Updated Date - 2021-01-25T05:39:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising