ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుర్గాభోగేశ్వరుడిని తాకిన సూర్య కిరణాలు

ABN, First Publish Date - 2021-11-29T05:46:58+05:30

కర్నూలు జిల్లాలో దక్షిణ కాశీగా పేరుగాంచిన గడివేముల మండలంలోని దుర్గాభోగేశ్వరుడి ఆలయంలో ఆదివారం ఉదయం 6.50 గంటలకు సూర్యకిరణాలు ఉద యం గర్భగుడిలోని దుర్గాభోగేశ్వరుడిపై ప్రసరించాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గడివేముల, నవంబరు 28: కర్నూలు జిల్లాలో దక్షిణ కాశీగా పేరుగాంచిన గడివేముల మండలంలోని దుర్గాభోగేశ్వరుడి ఆలయంలో ఆదివారం ఉదయం 6.50 గంటలకు సూర్యకిరణాలు ఉద యం గర్భగుడిలోని దుర్గాభోగేశ్వరుడిపై ప్రసరించాయి. ప్రతి ఏడాది కార్తీకమాసం ఆరుద్ర నక్షత్రం తరువాత భోగేశ్వరుడిపై సూర్యకిరణాలు ప్రసరించడం ప్రారంభమయ్యేది. ఈ ఏడాది తుపాను ప్రభావంతో ఆకాశం మేఘావృతమై ఉండటంతో సూర్యకిరణాలు భోగేశ్వరుడిపై ఆలస్యంగా పడినట్లు ఆలయ అర్చకులు శ్యాంసుందర్‌శర్మ తెలిపారు. జనమేజయ మహారాజు కాలంలో నిర్మించిన భోగేశ్వరంలో ప్రతి ఏడాది కార్తీక మాసంలో ఈ అపురూపదృశ్యం ఆవిస్కృతమవుతోంది. సూర్యకిరణాలు ప్రారంభంలో శివలింగం పైభాగంలో తాకి రోజు రోజుకు పెరుగుతూ లింగమంతా ప్రసరిస్తాయి. ఆ తరువాత క్రమంగా తగ్గుతాయి. సూర్యకిరణాలు దుర్గాభోగేశ్వరుడిపై ప్రసరించే సమయంలో పూజలు చేస్తే భోగేశ్వరుడికి, సూర్య భగవానుడికి పూజలు చేసిన పుణ్యఫలం దక్కుతుందని అర్చకులు శ్యాంసుందర్‌శర్మ పేర్కొన్నారు. భక్తులకు ఈ దృశ్యం పది రోజుల పాటు కనువిందు చేస్తుందని ఆయన వివరించారు. 



Updated Date - 2021-11-29T05:46:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising