ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇద్దరు రైతుల ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-07-08T06:00:17+05:30

రైతులకు వ్యవసాయం భారమైపోయింది. అప్పులపాలై బలవన్మరణాలకు పాల్పడుతు న్నారు. జిల్లాలో బుధవారం ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బనగానపల్లె/ప్యాపిలి, జూలై 7: రైతులకు వ్యవసాయం భారమైపోయింది. అప్పులపాలై బలవన్మరణాలకు పాల్పడుతు న్నారు. జిల్లాలో బుధవారం ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. బనగానపల్లె మండలంలోని మీరాపురం గ్రామానికి చెందిన ఫకృద్దీన్‌ కుమారుడు మహబూబ్‌బాషా(29) అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు మూడు ఎకరాల సొంత భూమి ఉంది. మరో ఏడు ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. అయితే పంట పెట్టుబడుల కోసం సుమారు రూ.10 లక్షల అప్పు చేశాడు. పంటలు సరిగా పండక, అప్పు తీర్చే దారి లేక జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆయన్ను బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కర్నూలు వైద్యశాలలో కోలుకోలేక మృతి చెందాడు. మహబూబ్‌బాషాకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. భార్య ఫాతిమా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కృష్ణమూర్తి తెలిపారు. 


ప్యాపిలిలో..


ప్యాపిలిలో రైతు జింకల రాము(46)పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన రాముకు రెండు ఎకరాల సొంత పొలం ఉంది. మరో ఐదు ఎకరాల పొలం కౌలుకు తీసుకొన్నాడు. మూడేళ్లుగా వేరుశనగ, కంది, టమోటా, ఆముదం వంటి పంటలను సాగు చేశాడు. ఇందు కోసం బ్యాంకుల్లో, ప్రైవేటు వ్యక్తుల దగ్గర దాదాపు రూ.4 లక్షలు అప్పులు చేశాడు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్నాయి. తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగి మోపడయ్యాయి. తీర్చేదారి కనిపించలేదు. రాముకు నలుగురు కూతుళ్లు ఉన్నారు. రెండు ఎకరాల పొలం గత ఏడాది రూ.3.5 లక్షలకు విక్రయించి ఇద్దరి కూతుళ్లకు పెళ్లి చేశాడు. మరో ఇద్దరికి వివాహం కావల్సి ఉంది. అప్పులు ఎలా తీర్చాలో, బిడ్డలకు పెళ్లి ఎలా చేయాలో తోచక తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. దీంతో బుధవారం పొలానికి వెళ్లి అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చద్ది తీసుకొని పొలానికి వెళ్లిన భార్య శవమై పడి ఉన్న భర్త రామును చూసి భోరున విలపించింది. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ రాకేష్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రాము భార్య రంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 




Updated Date - 2021-07-08T06:00:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising