ఎల్లెల్సీలో పడి విద్యార్థి మృతి
ABN, First Publish Date - 2021-10-30T04:39:36+05:30
మండలంలోని ముద్దటమాగి గ్రామానికి చెందిన చాగప్ప (16) అనే విద్యార్థి తుంగభద్ర దిగువ కాలువలో పడి మృతి చెందినట్లు స్థానికులు, బంధువులు తెలిపారు.
హొళగుంద, అక్టోబరు 29: మండలంలోని ముద్దటమాగి గ్రామానికి చెందిన చాగప్ప (16) అనే విద్యార్థి తుంగభద్ర దిగువ కాలువలో పడి మృతి చెందినట్లు స్థానికులు, బంధువులు తెలిపారు. చాగప్ప హొళగుందలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. గురువారం పాఠశాలకు వచ్చిన విద్యార్థి తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పంపాపతి, లక్ష్మి, బంధువులు, తెలిసిన వారి ఇళ్లల్లో వెతికారు. ఆచూకీ లభ్యం కాలేదు. శుక్రవారం సాయంత్రం ఎల్లెల్సీ హీల్ కటింగ్ వద్ద విద్యార్థి మృతదేహం లభ్యమైంది. బాలుడి మృతి వార్త తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Updated Date - 2021-10-30T04:39:36+05:30 IST