ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు రాష్ట్రవ్యాప్త నిరసన

ABN, First Publish Date - 2021-10-28T05:11:23+05:30

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి ప్రజలపై భారం మోపుతున్నాయని, ఇందుకు నిరసనగా ఈనెల 28న 10 వామపక్షాల ఆధ్వర్యంలో నిరసనలు చేపడుతున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు.

మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. పది వామపక్షాల ఆధ్వర్యంలో..
  2. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ


 కర్నూలు(న్యూసిటీ), అక్టోబరు 27: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి ప్రజలపై భారం మోపుతున్నాయని, ఇందుకు నిరసనగా ఈనెల 28న 10 వామపక్షాల ఆధ్వర్యంలో నిరసనలు చేపడుతున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. సీఆర్‌ భవనలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క వస్తువుపై కూడా ధరలు తగ్గించలేదన్నారు. పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. విద్యుత చార్జీలు, ఆస్తిపన్నులు, చెత్తపన్నులతో రాష్ట్ర ప్రజలపై మోయలేని భారం పడిందన్నారు. ప్రభుత్వం ఎయిడెడ్‌ పాఠశాలలను మూసివేసే ప్రయత్నం చేస్తోందని, ఇప్పటికే కాకినాడ, విశాఖపట్నం తదితర చోట్ల విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారని అన్నారు. ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఖరీదైన భూములపై సీఎం జగన దృష్టి పడిందన్నారు. ప్రభుత్వం పూర్తిగా అప్పుల్లో మునిగిపోయిందని, కనీసం నెల జీతాలు, పెన్షనలు కూడా ఇవ్వలేక పోతోందని అన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసగా ప్రజా, విద్యార్థి, యువజన సంఘాలతో కలిసి ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. సమావేశంలో ఏపీ చేతివృత్తిసంఘాల సమాఖ్య రాష్ట్ర కన్వీనర్‌ కె.రామాం జనేయులు, జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య, ఎస్‌ఎన.రసూల్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-28T05:11:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising