ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు

ABN, First Publish Date - 2021-12-05T04:51:48+05:30

ఉరుకుంద ఈరన్న స్వామిని శనివారం అమావాస్య సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కౌతాళం, డిసెంబరు 4: ఉరుకుంద ఈరన్న స్వామిని శనివారం అమావాస్య సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ముందు రోజు రాత్రే చేరుకొని బస చేశారు. తెల్లవారుజామున పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. వేకువ జామున అర్చకులు స్వామివారికి సుప్రభాత సేవ, గంగి పూజ, గోపూజ, ఆకుపూజ, మహా మంగళహారతి నిర్వహించారు.


మంత్రాలయంలో భక్తుల రద్దీ


మంత్రాలయం: మంత్రాలయంలో చేపట్టే అమావాస్య పూజలకు భక్తులు భారీగా తరలి వచ్చారు. శనివారం రాఘవేంద్రస్వామి బృందా వనానికి విశేష పుష్ప అలంకరణ చేశారు. ఆంధ్ర, తెలంగాణ, తమిళ నాడు, కర్ణాకట నుంచి పెద్దసంఖ్యలో తరలిరావటంతో మఠం ప్రాంగాణం కిక్కరిసింది. నదిలో పుణ్య స్నానాలు ఆచరించి రథోత్సవం, ఊరేగింపులో పాల్గొన్నారు.


ఎమ్మిగనూరు: మండల పరిధిలోని పార్లపల్లిలో కార్తీక మాస పూజల్లో భాగంగా గ్రామంలో వెలసిన అభయాంజనేయ స్వామి ప్రభోత్సవాన్ని శనివారం వైభవంగా నిర్వహించారు. ఆలయ పూజారులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సింగ్‌ల్‌విండో చైర్మన్‌ చంద్రశేఖర్‌రెడ్డి, గ్రామ సర్పంచ్‌ సత్యనారాయణరెడ్డి, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-05T04:51:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising