కొలను భారతిలో ప్రత్యేక పూజలు
ABN, First Publish Date - 2021-12-06T04:37:15+05:30
కొత్తపల్లి మండలంలోని కొలను భారతి క్షేత్రంలో ఆదివారం సెలవు దినం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.
కొత్తపల్లి, డిసెంబరు 5: కొత్తపల్లి మండలంలోని కొలను భారతి క్షేత్రంలో ఆదివారం సెలవు దినం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఆదివారం ఆలయ పురోహితులు అమ్మవారిని నూతన వసా్త్రలతో అలంకరించారు. అనంతరం అమ్మవారికి కుంకుమార్చన, పుష్పార్చన, మంగళహారతి వంటి ప్రత్యేక పూజలు చేశారు. ఆద్యంతం ఈ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాస పూజలు నిర్వహించారు.
Updated Date - 2021-12-06T04:37:15+05:30 IST