ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మట్కా, ఐపీఎల్‌ బెట్టింగ్‌పై ప్రత్యేక నిఘా

ABN, First Publish Date - 2021-04-23T05:13:18+05:30

మట్కా, జూదం, ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌పై ప్రత్యేక నిఘా ఉంచామని, అందుకోసం ప్రత్యేక టీంను ఏర్పాటు చేశామని ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. గురువారం ఆదోనిలోని డీఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

పెద్దకడబూరులో మాట్లాడుతున్న ఎస్పీ ఫక్కీరప్ప
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలి 
  2. ఎస్పీ ఫక్కీరప్ప


ఆదోని, ఏప్రిల్‌ 22: మట్కా, జూదం, ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌పై ప్రత్యేక నిఘా ఉంచామని, అందుకోసం ప్రత్యేక టీంను ఏర్పాటు చేశామని ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. గురువారం ఆదోనిలోని డీఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం కరోనా కట్టడికి అందరి సహకారం అవసరమని అన్నారు. ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. హోంమినిస్టర్‌ ప్రత్యేక సర్వేలో పెద్దకడబూరు పోలీస్‌ స్టేషన్‌ బెస్ట్‌ అవార్డు దక్కించుకుందని, ఆ స్టేషన్‌ పరిధిలో పనిచేసే పోలీసులను సన్మానించామని తెలిపారు. మాస్కుపై సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు స్పెషల్‌ డ్రైవ్‌ జిల్లా వ్యాప్తంగా పెట్టామని, మాస్కు ధరించని వారిపై పెనాల్టీ తప్పవని హెచ్చరించారు. పోలీస్‌ కుటుంబాలు పూర్తి స్థాయిలో మొదటి కరోనా టీకాలు వేయించుకున్నారని, రెండో దశలో 68 శాతం మాత్రమే వేయించుకున్నారని తెలిపారు. మిగతా వారు కూడా రెండో టీకా వేయించుకోవాలని సూచించారు. పోలీస్‌ కుటుంబాలతో పాటు మిగతా వారు కూడా టీకాలపై అపోహలు పెంచుకోవద్దని, అందరూ వేయించుకోవాలని సూచించారు. కరోనా పేషెంట్ల నుంచి ప్రైవేటు ఆసుపత్రుల్లో అధికంగా ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికంగా ఫీజులు వసూలు చేసినట్లు అయితే 104కు కాల్‌ చేసి సమాచారం అందించాలన్నారు. మట్కా, ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు తెలిస్తే 7993822444 నెంబరుకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలు పాల్పడే వారికి పోలీసుశాఖలోని కొందరు సహకరిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, అలాంటి వారిని ఉపేక్షించేదిలేదని  హెచ్చరించారు. 


పెద్దకడబూరు పీఎస్‌కు అవార్డు అభినందనీయం: ఎస్పీ


పెద్దకడబూరు: పెద్దకడబూరు పోలీస్‌ స్ట్టేషన్‌కు జాతీయ స్థాయి లో అవార్డు రావడం అభనందనీయమని ఎస్పీ ఫక్కీరప్ప అన్నారు. గురువారం పెద్దకడబూరులో మాట్లాడుతూ నేరాల అదుపు, నియంత్రణ కమ్యూనిటీ పోలీసింగ్‌, గ్రామ రక్షక దళాలు, సీసీ కెమెరాల ఏర్పాటులో ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇదే స్ఫూర్తితో పోలీసింగ్‌లో ఆధునిక టెక్నాలజీని వినియోగించాలనన్నారు. ప్రజలకు మేరుగైనా సేవలు అందించి పోలీసు శాఖకు మంచిపేరు తీసుకోరా వలన్నారు. ఎమెల్యే బాలనాగిరెడ్డి మాట్లాడుతూ జాతీయ స్దాయిలోనే ప్రతిష్ఠాత్మక అవార్డు జిల్లాకు రావడం సంతోషమన్నారు. ఆదోని డీఎస్పీ వినోద్‌ కూమార్‌, సీఐ ఈశ్వరయ్య, పెద్దకడబూరు ఎస్‌ఐలు శ్రీనివాసులు, అశోక్‌, పోలీసులను ఎస్పీ ఫక్కీరప్ప, ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సన్మానించి, జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందజేశారు. తహసీల్దార్‌ కూమార స్వామి, కోసిగి యస్‌ఐ దనంజయ, వైసీపి యువనాయకుడు ప్రదీప్‌ రెడ్డి, నాయకులు పురుషోత్తం రెడ్డి, రాంమోహన్‌ రెడ్డి, గ్రామ సర్పంచ్‌ రామాంజినేయులు పాల్గొన్నారు


అభినందనలు తెలిపిన మంత్రి


ఆలూరు: జాతీయ స్థాయిలో కర్నూలు జిల్లా పెద్దకడబూరు పోలీస్‌ స్టేషన్‌కు అవార్డు రావడం అభినందనీయమని కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. గురువారం రాత్రి ఆలూరులో మంత్రి స్వగృహంలో ఎస్పీ ఫక్కీరప్ప, ఆదోని డీఎస్పీ వినోద్‌కుమార్‌, ఎస్‌ఐ శ్రీనివాసులు, కోసిగి సీఐ ఈశ్వరయ్య మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వారిని అభినందించారు. జాతీయ స్థాయిలో కేంద్ర హోంశాఖ పెద్దకడబూరు స్టేషన్‌కు ఎక్సలెన్సీ అవార్డు రావడం హర్షణీయమన్నారు. ఆలూరు సీఐ భాస్కర్‌, ఎస్‌ఐ రామానుజులు అన్నారు.

Updated Date - 2021-04-23T05:13:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising