ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శభాష్‌.. పుల్లయ్యా..!

ABN, First Publish Date - 2021-04-16T05:53:55+05:30

ఎన్నికల హామీలు అంటే.. చాలామటుకు నీటి మూటలే. ఇది నాయకులపై ప్రజలకున్న నిశ్చితాభిప్రాయం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గిప్యాపిలి, ఏప్రిల్‌ 15: ఎన్నికల హామీలు అంటే.. చాలామటుకు నీటి మూటలే. ఇది నాయకులపై ప్రజలకున్న నిశ్చితాభిప్రాయం. విజయం సాధించినా.. హామీలు నెరవేర్చేందుకు చాలామంది మీన మేషాలు లెక్కిస్తారు. కానీ ఎన్నికల్లో ఓడినా.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఇంటింటికీ కొళాయి ఏర్పాటు చేయించాడు ఓ గ్రామస్థాయి నాయకుడు. ప్యాపిలి మండలంలోని చిన్నపూదిళ్లకు చెందిన టీడీపీ నాయకుడు ఆవుల బండ పుల్లయ్య పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌ అభ్యర్థిగా పోటీ చేశాడు. ఎన్నికల్లో తనకు సహకరిస్తే ఇంటింటికీ కొళాయి వేయిస్తానని ఎస్సీ కాలనీవాసులకు హామీ ఇచ్చాడు. ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. అయినా.. ఇచ్చిన హామీ మేరకు ఉచితంగా కొళాయిలను ఏర్పాటు చేయించి, గురువారం ప్రారంభించారు. ఇందుకోసం ఆయన రూ.2 లక్షలు వెచ్చించారు. కాలనీ ప్రజలు పుల్లయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2021-04-16T05:53:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising