ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘రంజాన్‌ వేడుకల్లో నిబంధనలు పాటించాలి’

ABN, First Publish Date - 2021-05-14T06:08:35+05:30

కరోనా నిబంధనలు పాటిస్తూ రంజాన్‌ పర్వదినాన్ని జరుపుకోవాలని తహసీల్దార్‌ ప్రకా్‌షబాబు పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్మకూరు, మే 13: కరోనా నిబంధనలు పాటిస్తూ రంజాన్‌ పర్వదినాన్ని జరుపుకోవాలని తహసీల్దార్‌ ప్రకా్‌షబాబు పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కరోనా విజృంభణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈద్గాలు, మసీదులలో సామూహిక నమాజ్‌లు పూర్తిగా నిషేధించినట్లు చెప్పారు.  ఇండ్లలోనే రంజాన్‌ వేడుకలను జరుపుకోవాలని సూచించారు.  


వేడుకలకు దూరం:  ఆత్మకూరు పట్టణంలో శుక్రవారం జరగనున్న రంజాన్‌ పర్వదిన వేడుకలకు శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ బుడ్డా రాజశేఖరరెడ్డి హాజరు కావడం లేదని ఆ పార్టీ శ్రేణులు గురువారం వెల్లడించారు. గత ఏడాదిలాగే ఈసారి కూడా కొవిడ్‌ కేసులు తీవ్రంగా ఉన్నందు వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  కాగా  కొవిడ్‌ నిబంధనల మేరకు రంజాన్‌ జరుపుకోవాలని ఇరువురు నేతలు సూచించారు.


సంజామల: ముస్లింలు  రంజాన్‌  నమాజులు ఈద్గాలో జరపవద్దని   ఎస్‌ఐ తిమ్మారెడ్డి ముస్లిం మత పెద్దలకు సూచించారు. గురువారం   పోలీ్‌సస్టేషన్‌ ఆవరణలో మండల కేంద్రమైన సంజామలకు చెందిన ముస్లిం పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ   ముస్లింలు ఈద్గాలో నమాజులు చేయవద్దన్నారు. మసీదుల్లో పరిమితికి మించకుండా నమాజులు చేసుకోవాలన్నారు. ఈ  కార్యక్రమంలో ముస్లిం పెద్దలు, మాజీ ఎంపీపీ యూసుఫ్‌ హుస్సేన్‌, అన్వర్‌ మౌలానా, అమీర్‌సాబ్‌ నబీరసూల్‌, ఆర్‌ మహ్మద్‌హుస్సేన్‌, రెడ్డి మగ్బుల్‌, చిన్న మహబూబ్‌సాహెబ్‌ పాల్గొన్నారు. 


పాములపాడు: రంజాన్‌ ప్రార్థనలు ఈద్గాల్లో,  బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించరాదని ఎస్‌.ఐ. రాజ్‌కుమార్‌ అన్నారు. గురువారం స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌.ఐ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా నిబంధనలు పాటిస్తూ పరిమిత సంఖ్యలో మసీదులలో ప్రారఽఽ్ధనలు నిర్వహించి సహకరించాలన్నారు. 



Updated Date - 2021-05-14T06:08:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising