ఆర్టీసీ కండక్టర్ ఆత్మహత్య
ABN, First Publish Date - 2021-10-30T04:40:42+05:30
కుటుంబ కలహాలు, అనారోగ్యం కారణంగా ఏపీఎస్ ఆర్టీసీ కండక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు.
ఎమ్మిగనూరు టౌన్, అక్టోబరు 29: కుటుంబ కలహాలు, అనారోగ్యం కారణంగా ఏపీఎస్ ఆర్టీసీ కండక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఎమ్మిగనూరు పట్టణం గాంధీనగర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. ఆత్మకూరు తాలుకా వెలుగోడు మండలానికి చెందిన శివరామిరెడ్డి(39) ఎమ్మిగనూరు ఎపీఎస్ ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీనికితోడు భార్య రెండేళ్ల కిత్రం విడాకులు తీసుకుంది. నాటి నుంచి ఒంటిరిగా ఉంటున్నాడు. ఈ కారణంగా మనస్తాపం చెంది గురువారం రాత్రి ఇంటిలో పంచెతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం గుర్తించిన స్థానికులు పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహన్ని శవపరీక్ష నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Updated Date - 2021-10-30T04:40:42+05:30 IST