ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘రోశయ్య సేవలు మరువలేనివి’

ABN, First Publish Date - 2021-12-05T04:53:20+05:30

ఆర్థిక మంత్రిగా అసెంబ్లీలో 18 సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన రోశయ్య సేవలు మరువలేనివని పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి నీలకంఠప్ప, మాజీ మార్కెట్‌ యార్డు చైర్మన్‌ దేవిశెట్టిప్రకాష్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదోని టౌన్‌, డిసెంబరు 4: ఆర్థిక మంత్రిగా అసెంబ్లీలో 18 సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన రోశయ్య సేవలు మరువలేనివని పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి నీలకంఠప్ప, మాజీ మార్కెట్‌ యార్డు చైర్మన్‌ దేవిశెట్టిప్రకాష్‌ అన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు మారుతిరావు, దిలీప్‌ధోకా, సాయినాథ్‌, అంజి, మెహబూబ్‌బాషా, ఆంజనేయులు పాల్గొన్నారు.


మాజీ ఎమ్మెల్యే రాచోటి రామయ్య, మాజీ శాసనమండలి సభ్యుడు బి.చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ రోశయ్య మృతి తెలుగు ప్రజలకు తీరని లోటు అని అన్నారు. నసీరుద్దీన్‌పటేల్‌, సుబ్బయ్య, పాండురంగయ్యశెట్టి, సుధాకర్‌, శ్యాంలాల్‌సోని ఆయనకు నివాళులర్పించారు.


ఆలూరు: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతి బాధాకరమని ఆలూరు మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన అపార రాజకీయ అనుభవం కలిగినవ్యక్తి అని అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. రాజకీయ అనుభవం ఉన్న మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృత బాధాకరమని ఆలూరు జడ్పీటీసీ సభ్యుడు ఏరూరు శేఖర్‌, మండల కోఆప్షన్‌ సభ్యుడు బాషా అన్నారు. రోశయ్య రాజకీయాలకు ఆదర్శమని తెలుగు రైతు కమిటీ రాష్ట్ర కార్యదర్శి నారాయణరెడ్డి అన్నారు. 

Updated Date - 2021-12-05T04:53:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising