ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్పందన అర్జీలను పరిష్కరించండి: ఆర్డీవో

ABN, First Publish Date - 2021-10-26T05:14:31+05:30

స్పందనలో వచ్చిన అర్జీలను ఎప్పటి కప్పుడు పరిష్కరించి బాధితులకు సత్వరమే న్యాయం అందించాలని ఆర్డీవో రామకృష్ణారెడ్డి వివిధ శాఖల అధికారులను ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదోని, అక్టోబరు, 25: స్పందనలో వచ్చిన అర్జీలను ఎప్పటి కప్పుడు పరిష్కరించి బాధితులకు సత్వరమే న్యాయం అందించాలని ఆర్డీవో రామకృష్ణారెడ్డి వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 17 మండలాల నుంచి బాధితులు ఇచ్చిన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. అర్జీలు ఇచ్చిన బాధితుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే  చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. 


వచ్చిన అర్జీలు 

నందవరం గ్రామానికి చెందిన జయరాముడు అనే రైతు తన పొలాన్ని ఆన్‌లైన్‌ ఎంట్రీ చేయాలని కోరారు. 

దేవనకొండ మండలం కుంకనూరు గ్రామానికి చెందిన రీనా బాషా అనే రైతు తన పొలం సర్వే చేయించాలని దరఖాస్తు చేశారు. 

ఆదోని పట్టణం ఎన్జీవో కాలనీకి చెందిన యశోద తన ఇంటికి పట్టా ఇవ్వాలని కోరారు. 

ఈ కార్యక్రమంంలో మున్సిపల్‌ కమిషనర్‌ ఆర్‌జీవీ కృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-26T05:14:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising