ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రమంగా తరలిపోతున్న ఎర్ర ఇసుక

ABN, First Publish Date - 2021-05-18T05:48:37+05:30

ఇసుకకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. దీంతో కొందరు అక్రమార్కులు ఎర్ర ఇసుకను తరలించి రోజుకు వేలాది రూపాయలు సంపాదిస్తున్నారు.

ట్రాక్టర్‌ సాయంతో ఎర్ర ఇసుకను తరలిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. నందిపల్లి పాలేరు వాగులో అక్రమంగా ఇసుక తరలింపు
  2. ట్రాక్టర్‌ ఇసుక రూ.5 వేలు


మహానంది, మే 17: ఇసుకకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. దీంతో కొందరు అక్రమార్కులు ఎర్ర ఇసుకను తరలించి రోజుకు వేలాది రూపాయలు సంపాదిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. మహానంది మండలం నందిపల్లి సమీపంలోని పాలేరు వాగులోని ఎర్ర ఇసుకను ట్రాక్టర్ల సాయంతో ఇతర గ్రామాలకు తరలిస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో వరదనీటికి పాలేరువాగు ద్వారా కొట్టుకొని వచ్చిన ఎర్ర ఇసుకకు ప్రస్తుతం మంచి డిమాండ్‌ ఉంది. దీంతో కొందరు ప్రతిరోజు 20 ట్రాక్టర్ల సహాయంతో రాత్రి, పగలు వందలాది ట్రిప్పులు ఎర్ర ఇసుకను పాలేరువాగు నుంచి ఆక్రమంగా తరలిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై గ్రామస్థుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ట్రాక్టర్‌ ఎర్ర ఇసుకను రూ. 5వేలకు విక్రయిస్తూ ప్రభుత్వ ఖజనాకు గండి కొడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నందిపల్లి సమీపంలోని పాలేరువాగు నుంచి ఎర్ర ఇసుక తరలింపును నిలిపి వేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - 2021-05-18T05:48:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising