ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విధుల్లో నిర్లక్ష్యం వద్దు: ఆర్డీవో

ABN, First Publish Date - 2021-04-17T04:52:26+05:30

భూ సర్వే విధులలో నిర్లక్ష్యం వద్దని ఆర్డీవో రామకృష్ణారెడ్డి సూచించారు. శుక్రవారం స్థానిక ఆర్ట్స్‌ కళాశాల సమావేశ భవనంలో ఆదోని డివిజన్‌ స్థాయి తహసీల్దార్లు, ఆర్‌ఐలు, సర్వేయర్ల సమావేశం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదోని, ఏప్రిల్‌ 16: భూ సర్వే విధులలో నిర్లక్ష్యం వద్దని ఆర్డీవో రామకృష్ణారెడ్డి సూచించారు. శుక్రవారం స్థానిక ఆర్ట్స్‌ కళాశాల సమావేశ భవనంలో ఆదోని డివిజన్‌ స్థాయి తహసీల్దార్లు, ఆర్‌ఐలు, సర్వేయర్ల సమావేశం నిర్వహించారు. ఆర్డీవో మాట్లాడుతూ జిల్లాలోని ఆదోని రెవెన్యూ డివిజన్‌లో పది గ్రామాలను కలుపుకొని పైలెట్‌ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ పైలెట్‌ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో భూ సర్వే నిర్వహించి రైతులకు ఎలాంటి సమస్యలు లేకుండా టైటిల్‌ లీడ్‌ను అందించే విధంగా చూడాలన్నారు. రెవెన్యూ రికార్డులులో ఉండే విధంగా రైతుల పట్టాదారు పాస్‌ పుస్తకాల్లో ఉండే భూమి కొలతలు పూర్తి స్థాయిలో సేకరణ చేసి రికార్డులు స్పష్టంగా ఉండే విధంగా చూడాలన్నారు. భూసర్వే చేసేటప్పుడు రైతుల పట్ల నిర్లక్ష్యం చేయకుండా రికార్డులను జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. భూ సర్వే ద్వారా రైతుల్లో ఎలాంటి అపోహాలు లేకుండా చూడాలన్నారు. సమావేశంలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ శ్రీనివాసులు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ హరికృష్ణ, డిప్యూటీ ఇన్స్‌పెక్టర్‌ సర్వేర్‌ విజయభాస్కర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-17T04:52:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising