ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డుపాలు చేయకండి

ABN, First Publish Date - 2021-01-17T05:42:47+05:30

నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం భూముల జోలికి రావొద్దని, తమ కుటుంబాలను రోడ్డుపాలు చేయొద్దని ఆర్‌ఏఆర్‌ఎస్‌ వ్యవసాయ కార్మికులు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1.  ఆర్‌ఏఆర్‌ఎస్‌ కార్మికుల వినతి


నంద్యాల, జనవరి 16: నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం భూముల జోలికి రావొద్దని, తమ కుటుంబాలను రోడ్డుపాలు చేయొద్దని ఆర్‌ఏఆర్‌ఎస్‌ వ్యవసాయ కార్మికులు అన్నారు. శనివారం సీఐటీయూ పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్‌, ఆర్‌ఏఆర్‌ఎస్‌ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఏవీ రమణ, ఖాదర్‌వలి, ఎల్లమ్మ, నాగేశ్వరమ్మ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ పరిశోధనా భూములను కాపాడుకునేందుకు ఆందోళనలు చేస్తున్నా ఎంపీ, ఎమ్మెల్యే నోరు మెదపకపోవడం దారుణమన్నారు. ఆర్‌ఏఆర్‌ఎస్‌పై ఆధారపడి పనులు చేసుకుంటూ జీవిస్తున్న వందలాది మంది వ్యవసాయ కార్మికుల కుటుంబాలను రోడ్డుపాలు చేయొద్దన్నారు. పరిశోధనా భూమిని కాపాడుకునేందుకు ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డిల ఇళ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. అరెస్టులకు, లాఠీ చార్జీలకు, అక్రమ కేసులకు భయపడేది లేదని అన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఏఆర్‌ఎస్‌ వ్యవసాయ కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-17T05:42:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising