ఘనంగా పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతి
ABN, First Publish Date - 2021-03-29T05:24:14+05:30
నంద్యాల గ్రీన్‌సొసైటీ ఆధ్వర్యంలో పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతి కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు.
నంద్యాల (కల్చరల్), మార్చి 28: నంద్యాల గ్రీన్‌సొసైటీ ఆధ్వర్యంలో పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతి కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పుట్టపర్తి నారాయణాచార్యుల చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు. తెలుగు సాహిత్యాకాఽశంలో ధ్రువతారగా నిలిచిన పుట్టపర్తి నారాయణాచార్యులు సరస్వతీ పుత్రగా పేరొంది తెలుగు సాహిత్యానికి శోభ చేకూర్చారని తెలుగు పండితుడు అన్నెం శ్రీనివాసరెడ్డి అన్నారు. సంగీతం, సాహిత్యం, నాట్యంలో సుప్రసిద్ధ్దులైన పుట్టపర్తి 14 భాషలలో పాండిత్యం సంపాదించి ఎన్నో నవలలు, నాటకాలు, కావ్యాలు రాసి సాహితీశిఖరంగా నిలిచారని సాహిత్యప్రియులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సాహితీ ప్రముఖులు ప్రధాన వక్త శ్రీనివాసరెడ్డి, దండు వెంకటేశ్వర్లు, నీకంఠమాచారి, వెంకటేశ్వర్లు, మాబుబాషా, శేషఫణి, రఫీ, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-03-29T05:24:14+05:30 IST