ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత సుందరయ్య

ABN, First Publish Date - 2021-05-20T06:17:54+05:30

దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య అని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యుడు ఏ నాగరాజు, జిల్లా కమిటీ సభ్యుడు సద్దాం హుసేన్‌ అన్నారు.

ఆత్మకూరులో సుందరయ్య చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. సీపీఎం జిల్లా  కార్యదర్శివర్గ సభ్యుడు నాగరాజు
  2. ఘనంగా వర్ధంతి


నంద్యాల, మే 19: దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత  పుచ్చలపల్లి సుందరయ్య అని సీపీఎం జిల్లా  కార్యదర్శి వర్గసభ్యుడు ఏ నాగరాజు, జిల్లా కమిటీ సభ్యుడు సద్దాం హుసేన్‌ అన్నారు. బుధవారం పుచ్చలపల్లి సుందరయ్య 36వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ   సుందరయ్య తన జీవితాన్ని ప్రజా పోరాటాలకు ధారపోశారని అన్నారు. 


ఆత్మకూరు: కమ్యూనిస్టు గాంధీగా పేరుగాంచిన పుచ్చలపల్లి సుందరయ్యను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యవర్గసభ్యుడు  ఏసురత్నం పేర్కొన్నారు. బుధవారం పుచ్చలపల్లి సుందరయ్య 36వ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక సీపీఎం కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్య్ర సమరయోదుడైన పుచ్చలపల్లి సుందరయ్య   కులవ్యవస్థను నిరసిస్తూ ఆయన  పేరులోని  రెడ్డి కులసూచికను తొలగించుకున్నారని అన్నారు.  ఈ సమావేశంలో ఆ పార్టీ నాయకులు నరసింహనాయక్‌, రణధీర్‌, స్వాములు, రామ్‌నాయక్‌, భాస్కర్‌, గణపతి తదితరులు ఉన్నారు. 


నందికొట్కూరు: నందికొట్కూరు పట్టణంలో సీపీఎం కార్యాలయం వద్ద ఆ పార్టీ నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని బుధవార ం ఘనంగా నిర్వహించారు. ఆయన  చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు నాగేశ్వరరావు మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య మహానేత అని, ప్రజల సమస్యల పరిష్కారం అలుపెరుగని పోరాటాలు చేశారని కొనియాడారు.  ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్‌రెడ్డి, బెస్తరాజు, పక్కీర్‌సాహెబ్‌, రజిత, మద్దమ్మ, కుమార్‌, రాజేష్‌ , సుంకన్న పాల్గొన్నారు. 


ఓర్వకల్లు: పుచ్చలపల్లి సుందరయ్య ఆశయ సాధన కోసం నిరంతరం పోరాటాలు కొనసాగించాలని సీపీఎం మండల కన్వీనర్‌ నాగన్న అన్నారు. బుధవారం మండల కేంద్రమైన ఓర్వకల్లులోని ప్రజాసంఘాల కార్యాలయంలో సుందరయ్య 36వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీధర్‌, ముర్తుజావలి, సుధాకర్‌  పాల్గొన్నారు. 


కొత్తపల్లి: పుచ్చలపల్లి సుందరయ్య ఆశయ సాధనలకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీఎం  మండల కార్యదర్శి స్వాములు పేర్కొన్నారు. బుధవారం మండలంలోని సింగరాజులప్లి, శివపురం గ్రామాల్లో  పుచ్చలపల్లి సుందరయ్య 36 వర్ధ్థంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.  ఈ కార్యక్రమాల్లో సీపీఎం నాయకులు సత్యరాజు,దాసు, రాజేష్‌, పవన్‌ దేవకుమార్‌  పాల్గొన్నారు.


ఆత్మకూరు రూరల్‌: పుచ్చలపల్లి సుందరయ్య జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సీపీఎం మండల కార్యదర్శి నరసింహనాయక్‌ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని అమలాపురం గూడెంలో సుందరయ్య 36వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి గిరిజనుల సమక్షంలో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య స్వాతంత్య్ర సమరంలో నిర్వహించిన అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారని అన్నారు.  ఈ కార్యక్రమంలో సీపీ ఎం  నాయకుడు వెంకటేశ్వర్లు, అమలాపురం గూడెం గిరిజనులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-20T06:17:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising