ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా యోగా దినోత్సవం

ABN, First Publish Date - 2021-06-22T05:35:45+05:30

నంద్యాలలో పలు స్వచ్ఛంద సంస్థలు, యోగాకేంద్రాలలో, ప్రభుత్వ ఆయుష్‌ విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించారు.

ఆళ్లగడ్డలో యోగా చేస్తున్న అధ్యాపకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల (కల్చరల్‌), జూన్‌ 21: నంద్యాలలో పలు స్వచ్ఛంద సంస్థలు, యోగాకేంద్రాలలో, ప్రభుత్వ ఆయుష్‌ విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ప్రాణాయామం, సూర్యనమస్కారాలు, యోగాసనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్‌ పార్కులో ఆయుష్‌ యోగా కేంద్రం నిర్వాహకులు ఆనంద్‌ గురూ జీ ఆధ్వర ్యంలో నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిఽథిగా బీజేపీ నంద్యాల పార్లమెంటు ఇన్‌చార్జి బుడ్డా శ్రీకాంత్‌ రెడ్డి, కౌన్సిలర్‌ ఖండె శ్యామ్‌సుందర్‌లాల్‌, న్యాయవాది దుర్గా ప్రసాద్‌, బీజేపీ  రాష్ట్ర నాయకుడు కశెట్టి క్రిష్ణమూర్తి పాల్గొన్నారు. నంద్యాల ప్రభుత్వ జిల్లా స్ధాయి ఆసుపత్రి ఆవరణలో ఆయుష్‌ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా వేడుకల కార్యక్రమంలో ఆయుర్వేద వైద్యులు డాక్టర్‌లు శ్రీదేవి, యశోదర, యునాని వైద్యులు శమిమునిషా, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. గ్రీన్‌ సొసైటీ ఆధ్వర్యంలో వెంకటేశ్వర్లు నిర్వహణలో, అమర వికాసయోగా కేం ద్రంలో యోగా సాధకులు, జాగృతి కౌన్సెలింగ్‌, యోగా సెంటర్‌లో మానసిక వికాసం కోసం సూర్యనమస్కారాలు, యోగాసనాలు, ప్రాణాయామం  చేశారు. 


ఆళ్లగడ్డ: యోగా చేయడం వల్ల సంపూర్ణ ఆరో గ్యం కల్గుతుందని ఎస్‌ఏఆర్‌ఎండీకళాశాల ప్రిన్సిపాల్‌ ప్రభాకరరావు అన్నారు. పట్టణంలోని కళాశాలలో అం తర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని అధ్యాపకులతో యోగాసనాలు చేయించారు. యోగా చేయ డం వల్ల శారీరక ఆరోగ్యం, మానసిక ఆత్మస్థైర్యం కలు గుతాయని అన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఎ్‌సఎ్‌స పోగ్రాం అధికారి శ్రీనివాసరావు, అధ్యాపకులు గోపాలరావు, మోహన్‌కుమార్‌రెడ్డి, రామగోపాల్‌, కృష్ణమూర్తి, రామలింగారెడ్డి పాల్గొన్నారు.


 చాగలమర్రి: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని యోగా శిక్షకులు సత్యనారాయణ, సుబ్బారావు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సం దర్భంగా సోమవారం భారతీ విద్యామందిరం, చెన్నకేశవ ఆలయంలో యోగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం ప్రసాదు, పాఠశాల కమి టీ సభ్యుడు మేడా ప్రభాకర్‌, రాజేష్‌ పాల్గొన్నారు. 


పాణ్యం: మానవాళి ఆరోగ్యంగా ఉండటానికి యో గా అతి ముఖ్యమైన మార్గమని యోగాచార్యులు నాగేశ్వరరావు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్స వం సందర్భంగా సోమవారం శాంతిరాం ఫార్మసీ కళాశాలలో యోగా ఫర్‌ వెల్త్‌ అండ్‌ హెల్త్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మధుసూదన్‌ శెట్టి, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-06-22T05:35:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising