ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ABN, First Publish Date - 2021-06-24T05:01:52+05:30

కరోనా విపత్కర పరిస్థితుల్లో సైనికుల్లా పని చేస్తున్న పారిశుధ్య కార్మికుల సమస్యలు తీర్చాలని ఏఐటీయూసీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు అజయ్‌బాబు డిమాండ్‌ చేశారు.

మున్సిపల్‌ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదోని, జూన్‌ 23: కరోనా విపత్కర పరిస్థితుల్లో సైనికుల్లా పని చేస్తున్న పారిశుధ్య కార్మికుల సమస్యలు తీర్చాలని ఏఐటీయూసీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు అజయ్‌బాబు డిమాండ్‌ చేశారు. బుధవారం మున్సిపల్‌ కార్యాలయం ముందు ఏఐటీయూసీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్‌ పారిశుధ్య కాంట్రాక్ట్‌ కార్మికులను పర్మనెంట్‌ చేయాలని, పారిశుధ్య కార్మికులకు జీతాలతోపాటు హెల్త్‌ అలవెన్స్‌ పెంచాలని, ఆప్కాస్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అమ్మఒడి, ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని కోరారు. పీఆర్సీ ప్రభుత్వం ప్రకటించాలని, రెగ్యులర్‌ కార్మికులకు జీపీఎఫ్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేయాలని, కాంట్రాక్ట్‌ కార్మికులకు కనీస వేతనం రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో హుసేని, జయరాజు, జాన్‌బాబు, ఎల్లప్ప, శాంత, అంజని, నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-24T05:01:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising