ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంతల రోడ్లు

ABN, First Publish Date - 2021-11-15T05:39:48+05:30

మండలంలోని మందలూరు, చందలూరు గ్రామాల మధ్య రహదారిపై మోకాలి లోతు గుంతలు ఏర్పడ్డాయి.

మందలూరు సమీపంలో మోటార్‌సైకిల్‌ను తోసుకుంటూ వెళ్తున్న వాహనదారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. మందలూరు, చందలూరు రహదారి అధ్వానం
  2. రాకపోకలకు తీవ్ర ఇబ్బంది పడుతున్న వాహనదారులు 

రుద్రవరం, నవంబరు 14: మండలంలోని మందలూరు, చందలూరు గ్రామాల మధ్య రహదారిపై మోకాలి లోతు గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. ఈ రహదారి ఆళ్లగడ్డ మండలం పడ కండ్ల నుంచి మండలంలోని గుర్రప్పనగర్‌ మెట్ట వరకు 16 కి.మీ. వరకు ఉంది. రహదారి మొత్తం గుంతలమయంగా మారింది. 16 ఏళ్ల క్రితం రహదారి నిర్మాణ పనులు చేపట్టిన పం చాయతీరాజ్‌ శాఖ ఆ తరువాత ఇటువైపు కన్నెత్తి చూడటం లేదు. రోజుకు వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. విద్యార్థులు, బాటసారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాలకులు పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. 

- రుద్రవరం మండలంలోని పెద్దకంబలూరు దక్షిణకొట్టాల గ్రామాల మధ్య రహదారి అధ్వానంగా తయారైంది. రహదారి కబ్జాకు గురైంది. రెండు గ్రామాల మధ్య రాకపోకలు సాగేదెలా అని రైతులు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ రహదారికి ఇరువైపులా 500 నుంచి 1,000 ఎకరాలు పంట భూములు ఉన్నాయి. పంట భూములకు ఎరువులు, విత్తనాలు రవాణా చేసుకోవడం కష్టంగా మారిందని వాపోతున్నారు. 


నీటి కుంటలను తలపిస్తున్న రహదారి

చాగలమర్రి, నవంబరు 14: చాగలమర్రి నుంచి మల్లెవేములకు వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారి అధ్వానంగా మారింది. తారు రోడ్డు గుంతలమయంగా మారి నీటి కుంటలను తలపిస్తోంది. రెండు అడుగుల గుంతలు ఏర్పడడంతో నీరు చేరి దారి కనిపించడం లేదు. ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని వాహనదారులు కోరుతున్నారు.




Updated Date - 2021-11-15T05:39:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising