ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శివరాత్రి బ్రహ్మోత్సవాల పోస్టర్‌ విడుదల

ABN, First Publish Date - 2021-03-06T05:38:05+05:30

బనగానపల్లె, మార్చి 5: యాగంటి ఉమామహేశ్వరస్వామి శివరాత్రి బ్రహ్మోత్సవ పోస్టర్లను ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు.

పోస్టర్‌ను విడుదల చేస్తున్న ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బనగానపల్లె, మార్చి 5: యాగంటి ఉమామహేశ్వరస్వామి శివరాత్రి బ్రహ్మోత్సవ పోస్టర్లను ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. 10వతేదీ నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో డీఆర్‌కేవీ ప్రసాద్‌ తెలిపారు. బుధవారం రుద్రాభిషేకం, కుంకుమార్చన, సహస్రనామావళి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 8 గంటలకు ధ్వజారోహణంతో శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం అవుతాయని తెలిపారు. 11 వ తేదీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జయమ్మ దంపతులతో ఉమామహేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. 12వతేదీ తెల్లవారుజామున 4 గంటలకు స్వామి  కళ్యాణం, అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సాయంత్రం నందికోల ఉత్సవం, 13న రథోత్సవం ఉంటాయన్నారు. 14వతేదీ శివదీక్ష విరమణ, పూర్ణాహుతి నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 9 గంటలకు నాగవల్లి వసంతోత్సవం, తెప్పోత్సవం ఉంటాయన్నారు. భక్తులకు నిత్యాన్నదాన సంస్థ, ఆర్యవైశ్య అన్నదాన సంస్థ ఆధ్వర్యంలో ఉచిత భోజన, వసతి కల్పిస్తున్నామన్నారు. ఉత్సవాల సందర్భంగా బనగానపల్లె నుంచి యాగంటికి ప్రత్యేక బస్సులు నడపనున్నామని అన్నారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మహేశ్వరశర్మ, బుచ్చిరెడ్డి, మనోహర్‌రెడ్డి, సిద్దంరెడ్డి రామ్‌మోహన్‌రెడ్డి, గుండం సూర్యప్రకా్‌షరెడ్డి, కిషోర్‌, ఆలయ అధికారి నాగేశ్వరరావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-06T05:38:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising