31న పల్స్ పోలియో
ABN, First Publish Date - 2021-01-26T05:44:37+05:30
జిల్లాలో ఈ నెల 31న పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌వో డా.బి.రామగిడ్డయ్య వెల్లడించారు.
కర్నూలు(హాస్పిటల్), జనవరి 25: జిల్లాలో ఈ నెల 31న పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌వో డా.బి.రామగిడ్డయ్య వెల్లడించారు. సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఆయన జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా.విశ్వేశ్వరరెడ్డితో కలిసి విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలో 0 నుంచి 5 ఏళ్ల లోపు పిల్లలు 5,62,610 మంది ఉన్నారని, వీరందరికి చుక్కల మందును వేస్తామని తెలిపారు. ఇందుకోసం జిల్లాలో 2,871 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 2204 కేంద్రాలు, పట్టణ ప్రాంతాల్లో 481 కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. ఈ నెల 31న చుక్కల పంపిణీ అనంతరం మిగిలిన పిల్లల కోసం ఫిబ్రవరి 1, 2 తేదీల్లో ఇంటింటికీ వెళ్తామన్నారు. కొవిడ్ నేపథ్యంలో ఈసారి పల్స్ పోలియోను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, ప్రతి పోలియో కేంద్రంలో ఉన్న నలుగురు సిబ్బంది మాస్కును ధరించాలని అన్నారు. అవగాహన ర్యాలీలో భౌతిక దూరం పాటించాలని, స్కూల్ పిల్లలను ర్యాలీకి దూరంగా ఉంచాలని డీఎంహెచ్‌వో ఆదేశించారు.
Updated Date - 2021-01-26T05:44:37+05:30 IST