ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కోనేర్లలో పుణ్యస్నానాలకు అనుమతి లేదు’

ABN, First Publish Date - 2021-10-30T04:04:01+05:30

భక్తుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో పెట్టుకొని మహానంది క్షేత్రంలో పుణ్యస్నానాలకు అనుమతి ఇవ్వడం లేదని జిల్లా వైద్యశాఖ అధికారి( డీఎంహెచవో) డాక్టర్‌ రామగిడ్డయ్య తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మహానంది, అక్టోబరు 29: భక్తుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో పెట్టుకొని మహానంది క్షేత్రంలో పుణ్యస్నానాలకు అనుమతి ఇవ్వడం లేదని జిల్లా వైద్యశాఖ అధికారి( డీఎంహెచవో) డాక్టర్‌ రామగిడ్డయ్య తెలిపారు. శుక్రవారం సాయంత్రం డీఎంహెచవో మహానందిలోని రుద్రగుండం, పూల కోనేర్లను ఆలయ ఈవో మల్లికార్జునప్రసాద్‌, ఏఈవో ఎర్రమల మధుతో కలిసి పరిశీలించారు. అనంతరం మాట్లాడారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు మహానంది ఆలయం ప్రాంగణంలోని కోనేర్లను పరిశీలించామని చెప్పారు. కరోనా మూడో వేవ్‌ ముప్పును దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం క్షేత్రంలో భక్తుల పుణ్యస్నానాల కోసం అదనంగా షవర్లను ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులను ఆదేశించారు. వచ్చే కార్తీకమాసం సందర్భంగా  మహానందికి దర్శనార్థమై వచ్చే భక్తులు తప్పని సరిగా కరోనా నిబంధనలను పాటించాలని కోరారు. ప్రస్తుతం జిల్లాలో కరోనా కేసులు తగ్గాయని చెప్పారు. జిల్లాలో 160 డెంగీ కేసులు నమోదు అయినట్లు తెలిపారు. వీరివెంట తిమ్మాపురం ప్రాఽథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికార్లు చంద్రశేఖర్‌, చిన్నలింగన్న  పాల్గొన్నారు.

 మహానందిలో పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యే పూజలు        

 మహానంది క్షేత్రంలో వెస్ట్‌ గోదావరి జిల్లా ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వద్ద వీరికి టెంపుల్‌ ఇనస్పెక్టర్‌ సుబ్బారెడ్డి స్వాగతం పలికారు.  అనంతరం ఎమ్మెల్యే ప్రధాన ఆలయాల్లో అభిషేకాలు, అర్చనలు నిర్వహించుకున్నారు. కళ్యాణ మంటపంలో వేదపండితులు వీరిని సన్మానించి, ప్రసాదాలు అందజేశారు. 

బుక్కాపురం ప్రణవానంద స్వామి మఠాన్ని సందర్శించిన పీఠాధిపతి                       

మహానంది మండలం బుక్కాపురం సమీపంలోని ప్రణవానందస్వామి మఠాన్ని ఉమామహేశ్వర గురు పీఠం పీఠాధిపతి ప్రణవానంద గిరి గురుస్వాములు శుక్రవారం సందర్శించారు. 8వ చాతుర్మాసంలో భాగంగా పీఠాధిపతి మఠాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. కార్యక్రమంలో బుక్కాపురం మాజీ సర్పంచ గడ్డం హరిప్రసాద్‌, టీడీపీ నాయకుడు గడ్డం నాగపుల్లయ్యలతోపాటు పీఠాధిపతి శిష్యులు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-30T04:04:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising