ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కళ్లల్లో కారం కొట్టి... చైన్‌ స్నాచింగ్‌

ABN, First Publish Date - 2021-10-22T05:26:44+05:30

టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అరుంధతి నగర్‌లో ఓ ఇద్దరు మహిళలు చైన్‌ స్నాచింగ్‌ పాల్పడిన ఘటన కలకలం రేపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు, అక్టోబరు 21: టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అరుంధతి నగర్‌లో ఓ ఇద్దరు మహిళలు చైన్‌ స్నాచింగ్‌ పాల్పడిన ఘటన కలకలం రేపింది. అరుంధతి నగర్‌కు చెందిన కళ్యాణి గురువారం ఎల్‌ఐసీ కాలనీకి వెళ్లి తిరిగి ఇంటికి బయలుదేరింది. ఇంటికి సమీపంలోకి రాగానే ఓ ఇద్దరు మహిళలు కళ్యాణి కళ్లల్లో కారం కొట్టి ఆమె మెడలో గొలుసును తెంపుకొని ఉడాయించారు. కళ్లు దులుపుకొని చూస్తే బురఖా వేసుకున్న ఓ మహిళ సమీపంలో ఉన్న కాలనీలోకి పరిగెత్తింది. పంజాబి డ్రస్సులో ఉన్న మరో యువతి సమీపంలో ఉన్న మరో బైక్‌పై ఉడాయించింది. దీంతో బాధితురాలు పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. బాధితురాలి భర్త వీరేంద్ర మున్సిపల్‌ కార్యాలయంలో అటెండరుగా పని చేస్తున్నారు. అపహరించిన గొలుసుల విలువ మూడు తులాలు ఉంటుందని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పార్థసారధిరెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-10-22T05:26:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising