ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్యకర్తలకు అండగా ఉంటా

ABN, First Publish Date - 2021-08-04T05:10:35+05:30

‘కొద్దిరోజులు ఓపిక పట్టండి.. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే, కార్యకర్తలు ఆధైర్య పడొద్దు’ అని మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి


మహానంది, ఆగస్టు 3: ‘కొద్దిరోజులు ఓపిక పట్టండి.. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే, కార్యకర్తలు ఆధైర్య పడొద్దు’ అని మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం మహానంది మండల టీడీపీ కార్యకర్తల సమావేశం శివా గార్డెన ఫంక్షన హాలులో మండల టీడీపీ కన్వీనర్‌ ఉల్లిమధు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావే శానికి ముఖ్య అతిఽథిగా మాజీ ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. తమ ప్రభుత్వ హయంలో జరిగిన అభివృద్ధి పనులకు కాంట్రాక్టర్లకు  బిల్లులు చెల్లించక ఇబ్బందులకు గురి చేస్తున్న వైసీపీ పార్టీకి న్యాయస్థానం ద్వారా గుణపాఠం చెస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుందని అన్నారు. అవి ఎక్కువ రోజులు ఉండవన్నారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదన్నారు. రాష్ట్రం అప్పుల పాలైందని, ఆ భారం ప్రజలపై పడుతుందన్నారు. కొన్ని గ్రామాల్లో వలంటీర్ల ద్వారా టీడీపీ కార్యకర్తలను బెదిరిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఇది ఎంత మాత్రం తగదన్నారు. అలాంటి వాటికి టీడీపీ కార్యకర్తలు బెదరాల్సిన పనిలేదన్నారు. అక్రమ కేసులు పెడితే సహించేది లేదని బుడ్డా అన్నారు. కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఊరుకొనేది లేదన్నారు. అధికారంలోకి వచ్చాక గతంలో పార్టీ అభివృద్ధికి కృషి చేసిన వారికే ప్రాధాన్యత ఇస్తామని, ఇందులో ఎలాంటి  అపోహాలు పడాల్సిన పనిలేదన్నారు. టీడీపీలో యువతకు ప్రాధాన్యత ఇస్తున్నామని, మహానంది మండలంలో కూడా కమిటీలో యువతకే పట్టం కట్టడం జరిగిందన్నారు. అనంతరం మండల, గ్రామ కమిటీ సభ్యులను బుడ్డా వేదికపై ప్రకటించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త బన్నూరి రామలింగారెడ్డి, మహానంది దేవస్దానం మాజీ  చైర్మన పాణ్యం ప్రసాదరావు, మండల టీడీపీ కన్వీనర్‌ మధు, టీడీపీ నాయకులు నరాల చంద్రమౌళీశ్వరరెడ్డి, నందిరెడ్డి, మహేశ్వరరెడ్డి, శ్యామల జనార్దనరెడ్డి, నాగపుల్లయ్య, ఈశ్వరయ్య, క్రాంతికుమార్‌ యాదవ్‌, మారెడ్డి సుబ్రహ్మణ్యం, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-04T05:10:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising