‘మానిటైజేషన్ విధానాన్ని వ్యతిరేకించాలి’
ABN, First Publish Date - 2021-10-22T05:25:49+05:30
కేంద్ర ప్రభుత్వం మానిటైజేష న్(నగదీకరణ) పేరుతో ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడాన్ని ప్రజలంతా వ్యతిరేకించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పీఎస్.రాధాక్రిష్ణ పిలుపునిచ్చారు.
కర్నూలు (న్యూసిటీ), అక్టోబరు 21: కేంద్ర ప్రభుత్వం మానిటైజేష న్(నగదీకరణ) పేరుతో ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడాన్ని ప్రజలంతా వ్యతిరేకించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పీఎస్.రాధాక్రిష్ణ పిలుపునిచ్చారు. మానిటైజేషన్ విధానాన్ని వ్యతిరేకించాలని కోరుతూ సీఐటీయూ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గురువారం జిల్లా పరిషత్ నుంచి పాతబస్టాండు కొండారెడ్డి బురుజు వరకు ర్యాలీ నిర్వ హించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో పోస్టల్ యూనియన్ నాయకులు గిరిబాబు, లక్ష్మీకాంత్, బీఎస్‌ఎన్‌ఎల్ నాయకులు వెంకట్రామిరెడ్డి, సీఐటీయూ నగర కార్యదర్శి అంజిబాబు, నగర అధ్యక్షుడు పుల్లారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నారాయణ, సాయిబాబ, గోపాల్ పాల్గొన్నారు.
Updated Date - 2021-10-22T05:25:49+05:30 IST