ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాత్రికి రాత్రే..!

ABN, First Publish Date - 2021-05-08T05:40:42+05:30

వ్యవసాయానికి ఆధారమైన చెరువును కొల్లగొట్టేస్తున్నారు.

ఎర్రమట్టిని తోడేందుకు సిద్ధంగా ఉంచిన జేసీబీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. చెరువు మట్టిని కొల్లగొడుతున్నారు
  2. ఇటుక బట్టీలకు అమ్ముకుంటున్న వైనం

    ఆళ్లగడ్డ, మే 7:
    వ్యవసాయానికి ఆధారమైన చెరువును కొల్లగొట్టేస్తున్నారు. ఎర్రమట్టి తవ్వేసి ఇటుకల బట్టీలకు తరలిస్తున్నారు. ప్రభుత్వానికి రాయల్టీ కూడా కట్టడంలేదు. శిరివెళ్ల మండలం బోయలకుంట్ల గ్రామంలో సర్వే నంబర్లు 566, 569, 570, 573-577లలో రంగరాజు చెరువు దాదాపు 220 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీనికి 600 ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొందరు వైసీపీ నాయకులు రంగరాజు చెరువులో వారం నుంచి ఎర్రమట్టి తవ్వకాలు సాగిస్తున్నారు. రాత్రిళ్లు వంద నుంచి రెండు వందల ట్రిప్పుల ఎర్రమట్టి ఇటుకల బట్టీలకు తరలించుకపోతున్నారు.

ఉదయం రైతులకు.. రాత్రిళ్లు ఇటుకల బట్టీలకు..
రంగరాజు చెరువులో మట్టిని పొలాలకు తరలించుకునేందుకు రైతులకు నంద్యాల మైనర్‌ ఇరిగేషన్‌ ఈఈ అనుమతి ఇచ్చారు. బోయలకుంట్ల రైతుల పొలాలకు పది వేల క్యూబిక్‌ మీటర్లు, గోపవరం రైతులకు 1,500 క్యూబిక్‌ మీటర్ల చెరువు మట్టిని తరలించుకునేందుకు ఉత్తర్వులు ఇచ్చారు. పగటి వేళల్లో చెరువులోని నల్లమట్టిని ట్రాక్టర్లలో రైతుల పొలాలకు తరలిస్తుంటే.. ఇదే పేరుతో కొందరు రాత్రి 9 నుంచి తెల్లవారుజాము వరకు ఎక్స్‌కవేటర్లతో చెరువులోని ఎర్రమట్టిని తోడి టిప్పర్లతో అయ్యలూరు, నంద్యాలలోని ఇటుకల బట్టీలకు తరలిస్తున్నారు. టిప్పర్‌కు రూ.5 వేల నుంచి 6 వేలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. మైనర్‌ ఇరిగేషన్‌ శాఖ అధికారులు ఇటువైపు కనెత్తి చూడడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.


మట్టిని విక్రయిస్తే చర్యలు
బోయలకుంట్ల రంగరాజు చెరువులోని మట్టిని విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. గ్రామంలోని రైతుల పొలాలకు మాత్రమే మట్టిని తరలించుకునేందుకు అనుమతి ఇచ్చాం. ఎర్రమట్టిని ఇటుకల బట్టీలకు విక్రయించుకునేందుకు అనుమతి ఇవ్వలేదు. నిబంధనలు అతిక్రమించి చెరువులో నుంచి మట్టిని తరలించడంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం.




Updated Date - 2021-05-08T05:40:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising