13 నుంచి నందవరంలో ఉగాది తిరుణాల
ABN, First Publish Date - 2021-04-11T05:03:25+05:30
బనగానపల్లె మండలంలోని నందవరం చౌడేశ్వ రీమాత ఆలయంలో జరిగే ఉగాది బ్రహ్మాత్సవాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కోరారు.
బనగానపల్లె, ఏప్రిల్ 10:
బనగానపల్లె మండలంలోని నందవరం చౌడేశ్వ రీమాత ఆలయంలో జరిగే ఉగాది
బ్రహ్మాత్సవాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కోరారు.
శనివారం సాయంత్రం 5.30 గంటలకు ఆలయంలో శనివారం వివిధ శాఖల అధికారులతో
సమీక్షా సమా వేశం నిర్వహించారు. ఆలయ ఈవో రామానుజన్, ఆలయ చైర్మన్ పీఆర్
వెంక టేశ్వరరెడ్డిలతో పాటు తాగునీటి, విద్యుత్, పోలీస్, వైద్యశాఖ,
పంచాయతీ, ఆర్టీసీ, తదితర శాఖలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉత్సవాలను
విజ యవంతం చేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రతలపై సమావేశంలో చర్చించారు. ఈ
సందర్భంగా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ నందవరం చౌడేశ్వరీమాత
ఉత్సవాలు ఈనెల 13 నుంచి 19వతేదీ వరకు జరుగుతాయని తెలిపారు. ఈ ఉత్సవాలకు
భారీఎత్తున భక్తులు రానున్నట్లు తెలిపారు. భక్తు లకు తాగునీరు, విద్యుత్
కోతలు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపా రు. కడప, అనంతపురం,
కర్నూలు నుంచి కూడా ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను నడపాలని ఆర్టీసీ
అధికారులను ఎమ్మెల్యే కోరారు. ఆలయం ఆవరణలో వైద్య శిబిరం నిర్వహించాలని
వైద్య శాఖాధికారులను ఆదేశించారు. ఆలయ ఈవో రామానుజన్, చైర్మన్ పీఆర్
వెంకటేశ్వరరెడ్డి, ఈవోఆర్‌డీ శివరామయ్య, పాణ్యం సీఐ జీవన్ గంగాధర్‌బాబు,
నందివర్గం ఎస్‌ఐ జగదీశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-04-11T05:03:25+05:30 IST