ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలకు అందుబాటులో ఉండాలి: సబ్‌కలెక్టర్‌

ABN, First Publish Date - 2021-11-06T04:29:45+05:30

సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పారదర్శకంగా పరిష్కరించాలని నంద్యాల సబ్‌ కలెక్టర్‌ చాహతబాజ్‌పాయ్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బనగానపల్లె, నవంబరు 5: సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పారదర్శకంగా పరిష్కరించాలని నంద్యాల సబ్‌ కలెక్టర్‌ చాహతబాజ్‌పాయ్‌ తెలిపారు. శుక్రవారం మండలంలోని నందవరం గ్రామ సచివాలయాన్ని తహసీల్దారు ఆల్‌ఫ్రెడ్‌తో కలసి ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు.  సచివాలయ పరిధిలోని గ్రామ జనాభా వివరాలను, పెన్షన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారుల జాబితాను సచివాలయం ఎదుట ప్రదర్శించాలని సిబ్బందిని ఆదేశించారు.   అనంతరం బనగానపల్లె పట్టణంలో నిర్మించనున్న బైపాస్‌ రోడ్డు నిర్మాణం కోసం అవసరమయ్యే భూములను పరిశీలించారు. భానుముక్కల, మిట్టపల్లె గ్రామాల్లోని 34 ఎకరాల భూమిని పరిశీలించారు. అనంతరం ప్రతిపాదనలను ఉన్నతాధికారులకు సమర్పిస్తామన్నారు. అనంతరం పలుకూరు, రామకృష్ణాపురం గ్రామాల్లో  జగనన్న గృహాల కొరకు అవసరమయ్యే భూముల్ని పరిశీలించారు. అలాగే మిట్టపల్లె గ్రామంలో జగనన్న సంపూర్ణ గృహహక్కు వనటైం సెటిల్మెంట్‌ పై జరుగుతున్న సర్వేను పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్‌ఆండ్‌బీ ఏఈ హుస్సేన; వీఆర్‌వోలు తిమ్మారెడ్డి, హైసింగ్‌ ఏఈ నాగరాజు, వీఆర్‌వో బాలన్న, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2021-11-06T04:29:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising