ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలకు అందుబాటులో ఉండాలి: కలెక్టర్‌

ABN, First Publish Date - 2021-10-21T05:30:00+05:30

ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని కలెక్టర్‌ పి.కోటేశ్వర రావు ఆదేశించారు.

రాజీవ్‌ నగర్‌ వార్డు సచివాలయాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(అర్బన్‌), అక్టోబరు 21: ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు ఆదేశించారు. గురువారం నగరంలోని అశోక్‌ నగర్‌-116, రాజీవ్‌నగర్‌-110 నంబర్‌ సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పట్టిక, సంక్షేమ  పథకా క్యాలండర్‌, ఎస్‌ఎల్‌సీ గడువులోగా ప్రజా సమస్యల పరిష్కార చర్యల నివేదిక,  ప్రభుత్వ పతకాల పోస్టర్‌లు తదితర వాటిని పరిశీలించారు. అశోక్‌నగర్‌ 116లో అడ్మిన్‌ సెక్రటరీ విధులకు ఆలస్యంగా రావడంతో కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డు సచివాలయాల్లో ఉద్యోగల జాబితా బోర్డు, వార్డు సచి వాలయం బయట బోర్డు సరిగా లేకపోవడంతో ఆసం తృప్తి వ్యక్తం చేశారు. 110 సచివాలయంలో ఎంత మంది పింఛన్‌దారులు ఉన్నారు.. ఏఏ రకాల పింఛన్లు ఉన్నాయి వంటి వివరాలను వార్డు వెల్పేర్‌ సెక్రటరీలను అడిగి తెలుసుకున్నారు. రాజీవ్‌నగర్‌ వార్డు సచి వాలయంలో 60 సంవత్సరాలపై బడిన వారు 260, 45 సంవత్సరాల లోపు ఉన్న వారు 530 మంది, గర్భి ణులు 18 మంది, 18 సంవత్సరాలు పైబడి 44 సంవ త్సరాల లోపు ఉన్న వారు వార్డు సచివాలయం పరిధి లో 1343 మంది ఉన్నారని ఏఎన్‌ఎం కలెక్టర్‌కు వివరించారు. ప్రభుత్వ ఆశయం సిద్ధించేలా, అన్ని రకాల సేవలను సచివాలయాల్లోనే ప్రజలకు అందించాలని వార్డు సచివాలయం సిబ్బంది కలెక్టర్‌కు వివరించారు. 

కర్నూలు(కలెక్టరేట్‌): వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న మున్సిపాలిటీ, జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్‌, వార్డు మెంబర్ల ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని ఉన్నతాధికా రులను కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు ఆదేశించారు. గురువారం రాత్రి కాన్ఫరెన్స్‌ హాల్లో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాయింట్‌ కలెక్టర్లు డా.మనజీర్‌ జిలాని సామూన్‌, రామసుందర్‌రెడ్డి, నారపురెడ్డి మౌర్య, శ్రీనివాసులు, డీఆర్వో పుల్లయ్య పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఎప్పుడు నోటిఫికేషన్‌ విడుదల చేసినా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లాలో జడ్పీటీసీకి కొలిమిగుండ్ల, నంద్యాల మండలాలకు ఎన్నికలు జరపాల్సి ఉన్నాయని, ఏడు మండలాల్లో పది ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉందని, ఎమ్మిగనూరు పదో వార్డు, నందికొట్కూరు పదో వార్డు, బేతంచెర్ల మున్సిపాలిటీల్లోని అని వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉందని తెలిపారు. సీ బెళగల్‌ మండలంలోని యనగండ్ల పంచాయతీ, క్రిష్ణగిరి మండలంలోని లక్కసాగరం, ఎమ్మిగనూరు మండలంలోని తిమ్మాపురం గ్రామ పంచాయతీలకు సర్పంచు ఎన్నికలు జరగాల్సి ఉందని అన్నారు. అలాగే 21 మండలాల్లో 21 గ్రామ పంచాయతీలోని 21 వార్డు మెంబర్లకు ఎన్నికలు జరగాల్సి  ఉందని వివరించారు.


Updated Date - 2021-10-21T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising