ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెనూ ప్రకారం భోజనం పెట్టాలి: పీడీ

ABN, First Publish Date - 2021-12-08T05:44:47+05:30

విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని డ్వామా పీడీ అమర్‌నాథ్‌రెడ్డి సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆలూరు, డిసెంబరు 7: విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని డ్వామా పీడీ అమర్‌నాథ్‌రెడ్డి సూచించారు. ఆలూరు మోడల్‌ స్కూల్‌లో మధ్యాహ్న భోజనాన్ని ఎంపీపీ సుభాషిణితో కలిసి మంగళవారం పరిశీలించారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని భోజనం తయారు చేయాలని అన్నారు. భోజనం గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో 600 మందికిపైగా విద్యార్థులు ఉన్నారని, వంట మనుషులు ఇద్దరే ఉన్నందున మరొకరిని నియమించాలని పీడీని ఎంపీపీ కోరారు. వెంటనే నియమిస్తామని పీడీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీవో అల్లాబకాష్‌, ఏపీడీ సురేష్‌, ఏపీవో హేమసుందర్‌, వైస్‌ ఎంపీపీ శ్రీరాములు, ప్రిన్సిపాల్‌ చాపల ఈరన్న పాల్గొన్నారు. 

ఆలూరు రూరల్‌: జగనన్న స్వచ్ఛ సంకల్పం పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని డ్వామా పీడీ అమర్‌నాథ్‌రెడ్డి సూచించారు. ఎంపీడీవో కార్యాలయంలో సర్పంచలు, ఎంపీటీసీలకు పథకం గురించి మంగళవారం  అవగాహన సదస్సు నిర్వహించారు.  గ్రామాల్లో తాగునీరు, వీధిలైట్లు, పారిశుధ్యం పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. భారీ వర్షాలకు రైతులు పంటలు నష్టపోయారని, ఇప్పుడు ఓటీఎస్‌ డబ్బులు కట్టాలని చెప్పడం సరికాదని హులేబీడు టీడీపీ ఎంపీటీసీ రమేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు.  


Updated Date - 2021-12-08T05:44:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising