ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హాస్టల్‌ను పునఃప్రారంభిస్తాం: జేసీ

ABN, First Publish Date - 2021-10-27T04:48:39+05:30

పాఠశాల ఆవరణలో అక్రమ కట్టడాలు ఉంటే వెంటనే తొలగించాలని, హాస్టల్‌ను పునఃప్రారంభిస్తామని జేసీ మనజీర్‌ జిలానీ సామూన్‌ తెలిపారు.

హాస్టల్‌ను తనిఖీ చేస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుగ్గలి, అక్టోబరు 26: పాఠశాల ఆవరణలో అక్రమ కట్టడాలు ఉంటే వెంటనే తొలగించాలని, హాస్టల్‌ను పునఃప్రారంభిస్తామని జేసీ మనజీర్‌ జిలానీ సామూన్‌ తెలిపారు. మండలంలోని పెండేకల్లు ఆర్‌ఎస్‌ జడ్పీ హైస్కూలు, ఎస్సీ హాస్టల్‌ను తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ పాఠశాల ఆవరణంలో ప్రహరీకి  అడ్డంగా ఆక్రమించుకుని ఇళ్లు, కొట్టాలు వేసుకుని ఉంటే వెంటనే తొలగించాలని, లేకపోతే ప్రభుత్వమే తొలగించి ఆక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అనంతరం శభాష్‌పురం, ఉప్పర్లపల్లి తదితర గ్రామాల్లో పర్యటించి సచివాలయాలు, విలేజ్‌ పార్కును పరిశీలించారు. సమస్యలు ఏమైనా ఉన్నా వెంటనే తమ దృష్టికి తేవాలని, అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా అధికారులు పనిచేయాలని సూచించారు. ఉపాధి పీడీ అమర్‌నాథ్‌రెడ్డి, డీఈవో రంగారెడ్డి, ఏపీసీ డాక్టర్‌ వేణుగోపాల్‌, తహీసీల్దార్‌ నజుమాభాను, ఎంపీడీవో వీరరాజు, ఎంఈవో రామవెంకటేష్‌గౌడ్‌, సర్పంచ్‌లు హరిక, మునేంద్ర, సుధాకర్‌రెడ్డి, హెచ్‌ఎం మైఖిల్‌, ఎస్‌ఎంసీ చైర్మన్‌ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 


 విద్యార్థులకు అన్ని వసతులతో కూడిన విద్యను అందించాలని డీఈవో రంగారెడ్డి సూచించారు. పెండేకల్లుఆర్‌ఎస్‌ జిల్లాపరిషత్‌ హైస్కూల్‌లోని ఆయన తనిఖీ చేసి మధ్యాహ్న భోజనం పరిశీలించడంతో పాటు విద్యార్థులతో చర్చించారు.  ఎంఈవో రామవెంకటేష్‌గౌడ్‌, ప్రధానోపాధ్యాయుడు మైఖిల్‌, సర్పంచ్‌ హరిక, సుధాకర్‌రెడ్డి, మునేంద్ర, నాగరాజు, నాగభూషణంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-10-27T04:48:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising