ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూ సర్వే త్వరగా పూర్తి చేయాలి: ఆర్డీవో

ABN, First Publish Date - 2021-10-27T04:42:29+05:30

మండల పరిధిలోని ఇబ్రహీంపురంలో భూ సర్వేను త్వరగా పూర్తి చేయాలని ఆర్డీవో రామకృష్ణారెడ్డి, డివిజనల్‌ సర్వేయర్‌ విజయ భాస్కర్‌ తెలిపారు.

సర్వేయర్లతో మాట్లాడుతున్న ఆర్డీవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందవరం, అక్టోబరు 26: మండల పరిధిలోని ఇబ్రహీంపురంలో భూ సర్వేను త్వరగా పూర్తి చేయాలని ఆర్డీవో రామకృష్ణారెడ్డి, డివిజనల్‌ సర్వేయర్‌ విజయ భాస్కర్‌ తెలిపారు. మంగళవారం సిబ్బందితో మాట్లాడుతూ రెండు రోజుల్లో భూ సర్వే గురించి పూర్తి వివరాల తమకు ఇవ్వాలని సూచించారు. అలాగే ప్రభుత్వ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం సచివాలయ సిబ్బంది తమ జీత భత్యాలు ప్రభుత్వం నిలిపి వేసిందని ఆర్డీవోకు మొరపెట్టుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దారు సతీష్‌కుమార్‌, డీటీ రఘవీరా, సర్వేయర్లు ముగతి శేఖర్‌, అనుమంతు, నాగేష్‌, ప్రవీణ్‌, శ్రీకాంత్‌, ఉరుకుందు, ప్రసాద్‌ పాల్గొన్నారు. 

మంత్రాలయం: మంత్రాలయంలో నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు వేస్తున్న వ్యాపారులకు నోటీసులు జారీ చేయాలని ఆర్డీవో రామకృష్ణారెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం తహసీల్దార్‌ కార్యలయంలో జగనన్న భూ సమగ్ర సర్వేపై సర్వేయర్లు, అధికారులతో సమీక్షించారు. సమావేశంలో తహసీల్దార్‌ చంద్రశేఖర్‌, ఆర్‌ఐ ఆదాం, సర్వేయర్‌ దావూద్‌ పాల్గొన్నారు.

ఎమ్మిగనూరు: దివ్యాంగుడి సమస్యను అక్కడికక్కడే పరిష్కరించడంతోపాటు నగదు అందజేసి ఆర్డీవో రామకృష్ణారెడ్డి మానవత్వం చాటుకున్నాడు. మంగళవారం నందవరం తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లిన ఆర్డీవోకు ఎస్‌ గోరంట్ల అనే దివ్యాంగుడు బస్సు పాస్‌ కోసం విన్నవించుకున్నాడు. ఇందుకు స్పందించిన ఆర్డీవో అందుకు అవసరమైన రూ.1800 నగదు సాయం చేశారు. 

Updated Date - 2021-10-27T04:42:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising