‘కార్మిక చట్టాలను అమలు చేయాలి’
ABN, First Publish Date - 2021-12-25T05:19:15+05:30
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని ఏఐటీయూసీ తాలుకా కార్యదర్శి మునిస్వామి డిమాండ్ చేశారు.
ఆలూరు రూరల్, డిసెంబరు 24: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని ఏఐటీయూసీ తాలుకా కార్యదర్శి మునిస్వామి డిమాండ్ చేశారు. ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలీచాలని వేతనాలతో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కార్మికులకు గుర్తింపు కార్డులు, ఈఎస్‌ఐ, ఈపీఎఫ్ ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం అధ్యక్షులు పద్మావతి, కార్యదర్శి జోష్, జయమ్మ, కాశీమా పాల్గొన్నారు.
Updated Date - 2021-12-25T05:19:15+05:30 IST