ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

ABN, First Publish Date - 2021-04-18T05:09:08+05:30

కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఫక్కీరప్ప సూచించారు.

వెల్దుర్తిలో మాస్కులు పంపిణీ చేస్తున్న ఎస్పీ ఫక్కీరప్ప
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డోన్‌(రూరల్‌), ఏప్రిల్‌ 17: కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఫక్కీరప్ప సూచించారు. శనివారం డోన్‌ పట్టణ పోలీస్‌స్టేషన్‌, రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ను ఆయన సందర్శించారు. స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి కృషి చేసిన పోలీసులను అభినందిస్తూ ప్రశంసా పత్రాలను ఎస్పీ అందజేశారు. అనంతరం పట్టణంలోని ప్రధాన రోడ్ల కూడలి వద్ద మాస్కులు ధరించని పాదచారులు, వాహనచోదకులకు మాస్కులను అందజేశారు. అనంతరం ఎస్పీ ఫక్కీరప్ప మాట్లాడుతూ ప్రజలు కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. జిల్లాలోని 87 పోలీస్‌స్టేషన్‌లలో మాస్కులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కరోనా రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు భౌతిక దూరం పాటించాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ప్రతిరోజు 2 గంటల పాటు మాస్కులపై స్పెషల్‌ డ్రైవ్‌ చేపడుతున్నట్లు తెలిపారు. మాస్కులు లేకుండా విచ్చలవిడిగా తిరిగితే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డోన్‌ డీఎస్పీ నరసింహారెడ్డి, రూరల్‌ సీఐ మహేశ్వరరెడ్డి, రూరల్‌ ఎస్‌ఐ ప్రియతమ్‌ రెడ్డి, పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం, పట్టణ ఎస్‌ఐ నరేష్‌, ఏఎస్‌ఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


వెల్దుర్తి: ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి.. భౌతిక దూరం పాటిస్తూ కరోనా నివారణకు సహకరించాలని ఎస్పీ ఫక్కీరప్ప కోరారు. శనివారం వెల్దుర్తి పట్టణ పోలీస్‌స్టేషన్‌ను ఆయన సందర్శించారు. అనంతరం పట్టణంలోని పాతబస్టాండు వద్ద మాస్కులు ధరించని పాదచారులు, వాహనచోదకులకు మాస్కులను అందజేశారు. ఎస్పీ ఫక్కీరప్ప మాట్లా డుతూ కరోనా టీకా ఆవశ్యకత, దాని ప్రాముఖ్యం గురించి పోలీసు అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. ప్రజలు కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. జిల్లాలోని 87 పోలీస్‌స్టేషన్‌లలో మాస్కులపై అవగాహన కార్యక్రమాలు చేపడు తున్నట్లు తెలిపారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ప్రతిరోజు 2 గంటల పాటు మాస్కులపై స్పెషల్‌ డ్రైవ్‌ చేపడుతున్నట్లు తెలిపారు. మాస్కులు లేకుండా విచ్చలవిడిగా తిరిగితే వారిపై జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డోన్‌ డీఎస్పీ నరసింహారెడ్డి, సీఐ మహేశ్వరరెడ్డి, వెల్దుర్తి ఎస్‌ఐ పెద్దయ్య నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-04-18T05:09:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising