తప్పులు చేయాలంటే భయపడాలి: ఎస్పీ
ABN, First Publish Date - 2021-08-03T04:57:30+05:30
తప్పులు చేయాలంటే భయపడే పరిస్థితి ఉండాలని ఎస్పీ సీహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి అన్నారు.
డోన్, ఆగస్టు 2: తప్పులు చేయాలంటే భయపడే పరిస్థితి ఉండాలని ఎస్పీ సీహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి డోన్ డీఎస్పీ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. డీఎస్పీ శ్రీనివాసరెడ్డితో పాటు సబ్ డివిజన్‌లోని సీఐలతో సమీక్ష నిర్వహించారు. సబ్ డివిజన్‌లో పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ సుధీర్ కుమార్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు.జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కిడ్నాప్, అదృశ్యం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో పెండింగ్ ఉండకూడదని, ఇన్వెస్టిగేషన్ వేగవంతం చేసి కేసుల్లో పురోగతి సాధించాలని ఆదేశించారు. ప్రజలకు సంబందించి ఏ సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Updated Date - 2021-08-03T04:57:30+05:30 IST