ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాజ్‌పేయ్ ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ: TG

ABN, First Publish Date - 2021-12-25T18:47:39+05:30

స్వర్గీయ వాజ్‌పేయ్ ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ అని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: స్వర్గీయ వాజ్‌పేయ్ ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ అని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. వాజ్‌పెయ్ జయంతి సందర్భంగా నిర్వహించిన సుపరిపాలన దినోత్సవంలో టీజీ పాల్గొని ప్రసంగించారు.  వాజ్‌పెయ్ ఎంతో సునిశిత, దూర దృష్టి కలిగిన విలక్షణమైన వ్యక్తి అని అన్నారు. వాజ్‌పెయ్ ఎంతో విలువలతో కూడిన రాజకీయాలు చేసిన వ్యక్తి అని కొనియాడారు. దేశంతో పాటు రాష్ట్రంలో కూడా బీజేపీకి లక్షల మంది సానుభూతిపరులు ఉన్నారన్నారు. కానీ ప్రజలు గెలుస్తామనుకున్న వారికే ఓటు వేసేటువంటి పరిస్థితి ఉందని తెలిపారు. దీనినే భారతీయ జనతా పార్టీ క్యాడర్ మార్చాల్సిన అవసరం ఉందని సూచించారు. అభివృద్ధి సాధించాలంటే అధికారం తప్పనిసరన్నారు. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్లమెంటులో ఎన్నో బిల్లులు పాసయ్యాయని, అన్ని బిల్లులు కూడా దేశ ప్రజల సంక్షేమానికి దేశ అభివృద్ధికి ఉపయోగపడే బిల్లులే అని తెలిపారు. వాజ్ పెయ్ ఆలోచనల ప్రకారం సుపరిపాలన అందించే దిశగా మోడీ ప్రభుత్వం కృషి చేస్తుందని టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు. 


Updated Date - 2021-12-25T18:47:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising