ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kurnool: సంఘంలో సభ్యత్వంలేదంటూ శవాన్ని అడ్డుకున్న పెద్దలు

ABN, First Publish Date - 2021-12-31T17:10:14+05:30

జిల్లాలోని మిడ్తూర్ మండలం కడుమురులో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో అనసూయమ్మ(73) అనే మహిళ మృతి చెందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: జిల్లాలోని  మిడ్తూర్ మండలం  కడుమురులో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో అనసూయమ్మ(73) అనే మహిళ మృతి చెందింది. మృతదేహాన్ని పూడ్చిపెట్టేందుకు బంధువులు స్మశానవాటికకు తీసుకెళ్లగా సంఘం పెద్దలు అడ్డుకున్నారు. సంఘంలో సభ్యత్వం తీసుకుంటేనే మృతదేహాన్ని స్మశానంలోకి అనుమతిస్తామని తేల్చిచెప్పారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  సంఘ పెద్దలకు, మృతురాలి బంధువులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. విషయం తెలిసిన పోలీసులు, రెవెన్యూశాఖ అధికారులు అక్కడకు చేరుకుని  మృతురాలి కొడుకుకు నచ్చజెప్పి  సభ్యత్వం కట్టించడంతో వివాదం సద్దుమణిగింది. అయితే మృతురాలి కొడుకు ఫిర్యాదు మేరకు శవాన్ని అడ్డుకున్న 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 


Updated Date - 2021-12-31T17:10:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising