ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేపీ ఉల్లికి తెగుళ్లు

ABN, First Publish Date - 2021-11-07T04:40:55+05:30

కేపీ రకం ఉల్లికి తెగుళ్లు సోకాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

తెగుళ్లతో ఎర్రబారిన కేపీ ఉల్లిపంట
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1.  తీవ్రంగా నష్టపోతున్న రైతులు


చాగలమర్రి, నవంబరు 6: కేపీ రకం ఉల్లికి తెగుళ్లు సోకాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చింతలచెరువు, చిన్నవంగలి, పెద్దవంగలి, కొలుములపేట, ఆవులపల్లె తదితర గ్రామాల్లో కృష్ణాపురం రకం(కేపీ) ఉల్లి సాగు చేశారు. గత ఏడాది కేపీ ఉల్లికి మంచి ధర లభించింది. దీంతో ఈ ఏడాది రైతులు అధికంగా సాగు చేశారు. ఎకరాకు రూ.50 వేల దాకా పెట్టుబడి అయింది. పంట ఏపుగా పెరిగి మంచి దిగుబడి వస్తుందని ఆశించిన సమయంలో ఎర్ర, సుంకు తెగుళ్లు సోకాయి. పంట ఎర్రబారి దెబ్బతింటోంది.  పురుగు మందులు పిచికారీ చేసినా తెగుళ్లు తగ్గడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. కొందరు రైతులు దెబ్బతిన్న పంటను దున్నేసి ప్రత్యామ్నాయంగా వేరుశనగ సాగుచేసేందుకు సిద్ధపడుతున్నారు. ఉద్యానవన, వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల వైపు కన్నెత్తి చూడటం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


తీవ్రంగా నష్టపోతున్నాం..


ఆరు ఎకరాలలో కేపీ ఉల్లి సాగు చేశాను. రూ.3 లక్షలు ఖర్చు అయింది. అధిక దిగుబడి సాధించవచ్చని ఆశించాను. సుంకు, ఎర్ర తెగుళ్ల వల్ల తీవ్రంగా నష్టపోతున్నాం. పంట ఎర్రబారి పోతోంది. ఎన్ని మందులు వాడినా తెగుళ్లు తగ్గడం లేదు. 


- నర్సిరెడ్డి, చింతలచెరువు 


పరిహారం ఇవ్వాలి..


రెండు ఎకరాల్లో కేపీ ఉల్లి పంట సాగు చేశాను. రూ.లక్ష పెట్టుబడి పెట్టాను. ఎర్ర తెగులు వల్ల పంట దెబ్బతింది. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేదు. ప్రభుత్వం మాకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. 


- మనోహర్‌ రెడ్డి, చింతలచెరువు 

Updated Date - 2021-11-07T04:40:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising