ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్నూలు జిల్లాలో వేడెక్కిన రాజకీయం.. కాటసాని వర్సెస్ జనార్థన్ రెడ్డి

ABN, First Publish Date - 2021-09-29T18:30:57+05:30

కర్నూలు జిల్లాలో రాజకీయం వేడెక్కింది. జడ్పీ ఛైర్మన్ కేసులపై రాజకీయ దుమారం రేగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: జిల్లాలో రాజకీయం వేడెక్కింది. జడ్పీ ఛైర్మన్ కేసులపై రాజకీయ దుమారం రేగుతోంది. లిక్కర్, ట్రాన్స్‌ఫోర్టు, పేకాట, క్రికెట్ బెట్టింగ్ కేసుల్లో ఉన్న వ్యక్తి  మల్కిరెడ్డి వెంకటసుబ్బారెడ్డిని జడ్పీ ఛైర్మన్‌గా నియమించడం సిగ్గుచేటని బనగానపల్లి టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బిసి జనార్థర్ రెడ్డి మండిపడ్డారు. ‘నీమీద కేసులు లేవా?’ అంటూ బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని కౌంటరిచ్చారు. ఇద్దరి మధ్య మాటల యుద్ధంతో బనగానపల్లి రాజకీయం వేడెక్కింది.


నిన్న మొన్నటి వరకు సవాళ్లు, ప్రతిసవాళ్లతో నాయకులు సై అంటే సై అనేవాళ్లు. ఇప్పుడు సవాళ్లను దాటి మాటల యుద్ధానికి దిగుతున్నారు. మూడు కేసుల్లో ముద్దాయిగా ఉన్న మల్కిరెడ్డి వెంకటసుబ్బారెడ్డిని వైసీపీ అధిష్టానం జడ్పీ ఛైర్మన్‌గా ఎలా ఎన్నుకుందంటూ జనార్థర్ రెడ్డి ప్రశ్నించారు. ఆయనను వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు. జనార్ధర్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కౌంటరిచ్చారు. జనార్ధన్ రెడ్డిపై 40కి పైగా కేసులు ఉన్నాయని, వాటికి ఆయన సమాధానం చెప్పాలని కాటసాని డిమాండ్ చేశారు. సొంత నియోజకవర్గానికి చెందిన వ్యక్తి జడ్పీ ఛైర్మన్‌గా ఎన్నికవ్వడంపై సంతోషించాల్సిందిపోయి బురద చల్లడం మంచిదికాదని హితవు పలికారు.

Updated Date - 2021-09-29T18:30:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising