ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్తీక పౌర్ణమి పూజలు

ABN, First Publish Date - 2021-11-20T05:53:24+05:30

కార్తీక మాసం పౌర్ణమి సందర్భంగా శుక్రవారం స్థానిక సంకల్‌బాగ్‌లోని హరిహర క్షేత్రంలో భక్తులకు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, కార్తీక పూజలు నిర్వహించారు.

వెల్దుర్తి: దీపాలు వెలిగిస్తున్న మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు (కల్చరల్‌) నవంబరు 19: కార్తీక మాసం పౌర్ణమి సందర్భంగా శుక్రవారం స్థానిక సంకల్‌బాగ్‌లోని హరిహర క్షేత్రంలో భక్తులకు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, కార్తీక పూజలు నిర్వహించారు. నగర బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో భక్తులచే శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఐదు వందల మందికి పైగా పాల్గొన్న ఈ వ్రత పూజల అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కళ్లే చంద్రశేఖర్‌ శర్మ, బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు. 


మద్దికెర: మండలంలోని మద్దికెర, ఎం.అగ్రహారం, పెరవలి గ్రామాల్లోని శివాలయాలు భక్తులతో పొట్టెత్తాయి. మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. బుగ్గసంగమేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదానం ఏర్పాటు చేశారు. 


 మద్దికెర గ్రామంలోని మద్దమ్మకుంట సమీపంలో వెలిసిన సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో మూలవిరాట్‌ సుబ్రహ్మణ్యస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దివంగత నాగిరెడ్డి సతీమణి వాణి ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. సాయంత్రం ప్రత్యేక పూజలతో పాటు తీర్థప్రసాదాలు పంపిణీ చేసి రాత్రి భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకుడు విజయప్రసాద్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 


వెల్దుర్తి: మండలంలోని పలు గ్రామాల్లో, పట్టణంలో కార్తీక పౌర్ణమి భక్తిశ్రద్ధలతో శుక్రవారం వైభవంగా నిర్వహించుకున్నారు. బ్రహ్మగుండ క్షేత్రంలో మహాశివునికి అభిషేకాది పూజలు నిర్వహించారు. మహిళలు దీపాలు వెలిగించారు. ఆలయ పూజారి నాగరాజు ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.


గూడూరు: మండలంలోని కె.నాగలాపురం సుంకులాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే కార్తీక పౌర్ణమి పురష్కరించుకొని కార్తీక దీపోత్సవం నిర్వహించారు. ఆలయ సిబ్బంది శ్రీనివాసులు, కేశవ, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-20T05:53:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising