ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీవో 10ను రద్దు చేయాలి

ABN, First Publish Date - 2021-10-27T05:30:00+05:30

రేషన్‌ డీలర్లను ఇబ్బందులకు గురి చేసే జీవో నంబరు 10 వెంటనే రద్దు చేయాలని ఆళ్లగడ్డ తాలుకా రేషన్‌ డీలర్ల సంఘం నాయకులు జక్కా సుబ్బరాయుడు, బైసాని ప్రసాద్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఆళ్లగడ్డలో ప్రభుత్వ గోదాముల వద్ద ధర్నా చేస్తున్న రేషన్‌ డీలర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. రెండో రోజూ రేషన్‌ డీలర్ల ధర్నా 


ఆళ్లగడ్డ, అక్టోబరు 27: రేషన్‌ డీలర్లను ఇబ్బందులకు గురి చేసే జీవో నంబరు 10 వెంటనే రద్దు చేయాలని ఆళ్లగడ్డ తాలుకా రేషన్‌ డీలర్ల సంఘం నాయకులు జక్కా సుబ్బరాయుడు, బైసాని ప్రసాద్‌  ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పట్టణంలోని ప్రభుత్వ గోదాముల వద్ద రెండో రోజూ బుధవారం డీలర్లు ధర్నా చేశారు.   కార్యక్రమంలో ఆళ్లగడ్డ, చాగలమర్రి డీలర్లు పాల్గొన్నారు. 


శిరివెళ్ల: రేషన్‌ డీలర్లకు ఇబ్బందికరమైన జీవో 10 రద్దయ్యే వరకు పోరాటం చేస్తామని డీలర్ల సంఘం నాయకులు నాగ సురేష్‌, బ్రహ్మయ్య, రఫీ అన్నారు. ఖాళీ గోనె సంచులను రేషన్‌ డీలర్లకు ఇవ్వకుండా ప్రభు త్వం తీసుకొచ్చిన జీవో 10 రద్దు చేయాలని రుద్రవరంలోని ఎమ్‌ఎల్‌ఎస్‌ పాయింట్‌ వద్ద రెండో రోజు బుధవారం వారు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీలర్లు జాఫర్‌వలి, మధు, బాలన్న పాల్గొన్నారు. 


కోవెలకుంట్ల: జీవో నంబర్‌ 10ను రద్దు చేయాలని కోవెలకుంట్ల పట్టణంలోని సివిల్‌ సప్లయ్‌ గోదాము వద్ద డీలర్ల సంఘం అధ్యక్షుడు పుల్లారెడ్డి, వల్లంపాడు జగదీశ్వరరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రెండో  రోజు రేషన్‌ డీలర్లు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర డీలర్ల సంఘం అసోసియేషన్‌ పిలుపు మేరకు సివిల్‌ సప్లయ్‌ గోదాము పరిధిలోని ఉయ్యాలవాడ, దొర్నిపాడు, సంజామల, కోవెలకుంట్ల మండలాలకు చెందిన డీలర్లు రెండో రోజు ధర్నాలో పాల్గొన్నారు. 

 


Updated Date - 2021-10-27T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising