ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీరు లేని జగనన్న కాలనీ

ABN, First Publish Date - 2021-07-21T05:38:58+05:30

‘ఇళ్లు కట్టుకోండి.. అన్ని సౌకర్యాలు కల్పిస్తామ’ని అధికారులు చెప్పడమేగాని పట్టించుకోవడం లేదు. మద్దికెర గ్రామం జగనన్న కాలనీలో పేదలు 220 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు.

ట్యాంకర్లతో నీటిని తెచ్చుకున్న లబ్ధిదారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మద్దికెర, జూలై 20: ‘ఇళ్లు కట్టుకోండి.. అన్ని సౌకర్యాలు కల్పిస్తామ’ని అధికారులు చెప్పడమేగాని పట్టించుకోవడం లేదు. మద్దికెర గ్రామం జగనన్న కాలనీలో పేదలు 220 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అయితే ఇళ్ల నిర్మాణానికి పునాదులు తీసుకున్న లబ్ధిదారులు రూ.500 పెట్టి ట్యాంకర్‌ నీరు కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇళ్లు నిర్మించుకోకపోతే పట్టాలు రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించడంతో నీటి సౌకర్యం లేకపోయినా.. ట్యాంకర్లతో నీరు కొని ఇళ్ల నిర్మాణానికి సిద్ధపడ్డారు. పునాది పనులకే రూ.15 వేలు ఖర్చు అయిందని ప్రభుత్వం ఇచ్చే రూ.1.80 లక్షలు ఎలా సరిపోతాయని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి జగనన్న కాలనీలో నీటి కష్టాలు తీర్చాలని వారు కోరుతున్నారు. ఈ విషయంపై హౌసింగ్‌ వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ కుమార్‌ మాట్లాడుతూ కాలనీలో బోర్లు వేశామని, విద్యుత్‌ సరఫరా ఆలస్యం కావడంతో నీటి కష్టాలు ఏర్పడ్డాయని, పరిష్కరిస్తామని వివరణ ఇచ్చారు.

Updated Date - 2021-07-21T05:38:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising