ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు కోసం దీక్ష

ABN, First Publish Date - 2021-04-18T05:06:51+05:30

నంద్యాలలోని ప్రధాన కూడలిలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, విద్యార్థి, యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంకిరి రామచంద్రుడు 48 గంటల నిరాహార దీక్షను ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



నంద్యాల (ఎడ్యుకేషన్‌), ఏప్రిల్‌ 17:
నంద్యాలలోని ప్రధాన కూడలిలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, విద్యార్థి, యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంకిరి రామచంద్రుడు 48 గంటల నిరాహార దీక్షను ప్రారంభించారు. శనివారం పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయం సర్కిల్‌లో దీక్షను ప్రారంభించారు.  విద్యార్థి, యువజన సంఘాల నాయకులు, విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టి శిబిరం వద్దకు చేరుకొని సంఘీభావం ప్రకటించారు.  సంఘం జిల్లా సహాయ కార్యదర్శి షేక్‌ రియాజ్‌, ఎంఆర్‌పీఎస్‌ రాష్ట్ర నాయకుడు కత్తి ఓబులేసు, మాదిగ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి బాయికాటి బెనర్జీ, రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాజునాయుడు, దివ్యాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్‌, రాయలసీమ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఓబులేసు  తదితరులు దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్రుడు మాట్లాడుతూ బొమ్మలసత్రం ఫ్లైఓవర్‌ బ్రిడ్జి కింద అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేయడానికి వీల్లేదని అన్నారు.


Updated Date - 2021-04-18T05:06:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising