ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పూర్తికాని రింగ్‌ రోడ్డు

ABN, First Publish Date - 2021-05-18T05:33:45+05:30

మండలంలోని ఐదు గ్రామాలను అనుసంధానం చేసే రింగ్‌ రోడ్డుకు 2005లో అప్పటి ఎమ్మెల్యే గంగుల ప్రతాపరెడ్డి భూమి పూజ చేశారు.

కంకరతేలిన రహదారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. ఐదు గ్రామాలకు అనుసంధానం కరువే
  2. పూర్తి కాక మునుపే కూలిపోయిన కల్వర్టు 


రుద్రవరం, మే 17: మండలంలోని ఐదు గ్రామాలను అనుసంధానం చేసే రింగ్‌ రోడ్డుకు  2005లో అప్పటి ఎమ్మెల్యే గంగుల ప్రతాపరెడ్డి భూమి పూజ చేశారు. బి.నాగిరెడ్డిపల్లె, పేరూరు, చిలుకలూరు, ఎర్రగుడిదిన్నె, చందలూరు గ్రామాలను ఈ రోడ్డు కలుపుతుంది.  ఈ రహదారికి అప్పట్లోనే రూ.3.05 కోట్లు కేటాయించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు పూర్తి కాలేదు. రహదారి పూర్తికాక మునుపే కల్వర్టులు కూలిపోయాయి. పనుల్లో నాణ్యత ఏమేరకు ఉందో ఇట్టే తెలిసి పోతుంది. 


ఏళ్లు గడుస్తున్నా అసంపూర్తిగా రహదారి

ఏళ్లు గడిచినా రహదారి పనులు పూర్తి కాలేదు. రహదారిపై పరిచిన కంకర బయట పడటంతో రాకపోకలకు ఇబ్బందులు తప్పటం లేదు. రహదారి నిర్మాణ పనులు పూర్తి చేసి సౌకర్యం చేకూర్చాలి. 

 - నరసింహుడు, మాజీ సర్పంచు, చిలుకలూరు 


రహదారిని పూర్తి చేయాలి

ఐదు గ్రామాలను అనుసంధానం చేస్తూ ఏర్పాటు చేసిన రహదారి పనులు పూర్తి చేయాలి. గ్రామాల మధ్య రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నాం. ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని రహదారి పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

 - ఉసేన్‌సా, మాజీ సర్పంచు, చిలుకలూరు 

Updated Date - 2021-05-18T05:33:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising