ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భక్తి శ్రద్ధలతో సుదర్శన హోమం

ABN, First Publish Date - 2021-04-18T05:09:09+05:30

నంద్యాల పట్టణం సంజీవనగర్‌ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం సాయంత్రం భగవాత్‌ సేవా సమాజ్‌ కమిటీ ఆధ్వర్యంలో సుదర్శన హోమాన్ని నిర్వహించారు.

వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల (కల్చరల్‌), ఏప్రియల్‌ 17: నంద్యాల పట్టణం సంజీవనగర్‌ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం సాయంత్రం భగవాత్‌ సేవా సమాజ్‌ కమిటీ  ఆధ్వర్యంలో సుదర్శన హోమాన్ని నిర్వహించారు. అర్చకులు శ్రీకాంత్‌ శర్మ ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణ నడుమ సుదర్శన హోమం భక్తిశ్రద్ధ్దలతో నిర్వహించారు.


నూతన స్వర్ణ శఠారి సమర్పణ
 నంద్యాల సంజీవనగర్‌ రామాలయంలో భక్తుల సహకారంతో నూతన స్వర్ణ శఠారిని స్వామివారికి సమర్పించారు. భగవత్‌ సేవాసమాజ్‌ కమిటీ  ఆధ్వర్యంలో నూతన స్వర్ణ శఠారికి ప్రత్యేక పూజలు నిర్వహించా రు. అనంతరం వసంత నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా శనివారం సీతారాముల ఉత్సవమూర్తులకు  మహామంగళ హారతి కార్యక్రమాన్ని నిర్వహిం చారు.  


చెన్నకేశవ పల్లకోత్సవం
చాగలమర్రి, ఏప్రిల్‌ 17:
మండలంలోని  వెల్లాల క్షేత్రంలో సంజీవరాయ, చెన్నకేశవ ఉత్సవమూర్తులచే పల్లకి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. శనివారం వేద పండితులు చెన్నకేశవ ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. వివిధ గ్రామాల నుంచి మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి తమలపాకులచే పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శోభారాణి, కమిటీ సభ్యులు బలరామిరెడ్డి, మహిళలు పాల్గొన్నారు.
ఫ చాగలమర్రి గ్రామంలోని కోదండ రామాలయంలో శనివారం వాసవీ మహిళలు లలితా  పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీతారాములకు సామూహికంగా వడిబియ్యం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం సీతారాముల పల్లకి మహోత్సవం నిర్వహించారు.   21న ఆలయంలో సీతారాముల కల్యాణోత్సవం నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.  


వెంకటేశ్వరస్వామికి పూజలు
రుద్రవరం, ఏప్రిల్‌ 17:
మండలంలోని కొండమాయపల్లె గ్రామ సమీపంలో కొలువుదీరిన వాసాపురం వెంకటేశ్వరస్వామికి, పార్వతీదేవి అమ్మవారికి శనివారం అర్చకులు  ప్రత్యేక పూజలు చేశారు.  కొండమాయపల్లె, రుద్రవరం, నంద్యాల, ఆళ్లగడ్డ, అప్పనపల్లె, ఇంకా పలు గ్రామాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.  
ఫరుద్రవరం సమీపంలో కొలువుదీరిన గుట్టకొండ లక్ష్మీనరసింహస్వామికి శనివారం ప్రత్యేక పూజలు చేశారు. రుద్రవరం, తువ్వపల్లె, నాగులవరం, ఇంకా పలు గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు. తరలివచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.  


అహోబిలంలో భక్తుల సందడి
ఆళ్లగడ్డ, ఏప్రిల్‌ 17: 
అహోబిలం లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శనివారం భక్తుల సందడి నెలకొంది. పాములేటి లక్ష్మీనరసింహస్వామి వారోత్సవాలు జరుగుతుండటంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు మొక్కుబడులు తీర్చుకునేందుకు వచ్చారు.   


మౌనస్వామి 44 వార్షికోత్సవం
శ్రీశైలం, ఏప్రీల్‌ 17:
శ్రీశైలం క్షేత్రం పరిధిలోని మౌపస్వామి ఆరాధనోత్సవం, 44వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా మౌనస్వామి సమాధికి పూజలు చేశారు.  అనంతరం  గణపతిపూజ, నవగ్రహ పూజ, రుద్రత్రిశక్తి హోమం జరిపించారు.

Updated Date - 2021-04-18T05:09:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising