ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యోగాతోనే ఆరోగ్యం

ABN, First Publish Date - 2021-06-22T05:13:35+05:30

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని యోగా సంఘం కార్యదర్శి అవినాష్‌ శెట్టి అన్నారు. బి క్యాంపు మైదానంలో కర్నూలు డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు.

కర్నూలు: పతంజలి సాయినాథ్‌ యోగ శిక్షణ కేంద్రంలో ఆసనాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(స్పోర్ట్స్‌) జూన్‌ 21: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని యోగా సంఘం కార్యదర్శి అవినాష్‌ శెట్టి అన్నారు. బి క్యాంపు మైదానంలో కర్నూలు డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. కరస్పాండెంట్‌ ఉమామహేశ్వరరావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో విశ్రాంత అధికారి రవీంద్ర, అథ్లెటిక్‌ శిక్షకులు మల్లేష్‌, కళాశాల అధ్యాపకులు అంబిక, జోషఫ్‌ గౌస్‌, ఉమాకాంత్‌, శిరీష ఎన్‌సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు.


కర్నూలు(అర్బన్‌), : యోగా ప్రాణదాతలా ఆదుకుంటుందని ఉర్దూ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ బాయినేని శ్రీనివాస్‌ అన్నారు. వర్సీటీలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయూష్‌ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో యూనివర్సిటీ సిబ్బంది యోగా ప్రతిజ్ఞను చేశారు. ఈ కార్యక్రమంలో బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.


కర్నూలు: జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా.వీఆర్‌కే కృపాసాగర్‌ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఎన్‌.శ్రీనివాసరావు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. న్యాయ సేవాసదన్‌ భవనంలో న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది చేత సోమవారం యోగా చేయించారు. కార్యక్రమంలో ఆదిత్య యోగా మెంబర్‌ ముంతాజ్‌ బేగం, జి.మురళీకృష్ణ, బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి అబ్దుల్‌ కరీమ్‌, న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-06-22T05:13:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising