ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంట నష్టం అంచనాలో ప్రభుత్వం విఫలం

ABN, First Publish Date - 2021-12-03T05:30:00+05:30

ఇటీవల కురిసిన వర్షాలకు జరిగిన పంట నష్టాన్ని అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆళ్లగడ్డ నియోజకవర్గ టీడీపీ నాయకుడు భుమా జగత్‌విఖ్యాత్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. టీడీపీ నాయకుడు భూమా జగత్‌విఖ్యాత్‌రెడ్డి 


ఉయ్యాలవాడ, డిసెంబరు 3: ఇటీవల కురిసిన వర్షాలకు జరిగిన పంట నష్టాన్ని అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆళ్లగడ్డ నియోజకవర్గ టీడీపీ నాయకుడు భుమా జగత్‌విఖ్యాత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హరివరం గ్రామంలో దెబ్బతిన్న శనగ పంటను ఆయన పరిశీలించారు. జరిగిన నష్టంపై రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో అధికంగా 10 వేల హెక్టార్లలో శనగ పంటను సాగు చేస్తున్నారన్నారు. ఈ వర్షాలకు 90 శాతం పంటలు దెబ్బతిన్నాయన్నారు. పంట నష్టాన్ని గుర్తించి వారికి సబ్సిడీలో శనగ విత్తనాలు ఇవ్వాలా లేదా పరిహారం చెల్లించాలా అన్న సందిగ్ధంలో ప్రభుత్వం ఉందన్నారు. ఆయన వెంట టీడీపీ మండల నాయకులు మారంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, బోరెడ్డి శేఖర్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, పల్లె బాబుల్‌రెడ్డి, కర్నాటి మహేశ్వరెడ్డి, రామస్వామిరెడ్డి, అనంత రామసుబ్బారెడ్డి, రైతులు ఉన్నారు.



Updated Date - 2021-12-03T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising