ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా భగత్‌ సింగ్‌ జయంతి

ABN, First Publish Date - 2021-09-29T04:42:41+05:30

విప్లవవీరుడు భగత్‌ సింగ్‌ 114వ జయంతి వేడుకలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉత్తేజభరితంగా జరిగాయి.

ఆదోనిలో నివాళులర్పిస్తున్న విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(న్యూసిటీ), సెప్టెంబరు 28: విప్లవవీరుడు భగత్‌ సింగ్‌ 114వ జయంతి వేడుకలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉత్తేజభరితంగా జరిగాయి. మంగళవారం ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో సీఆర్‌ భవన్‌లో భగత్‌సింగ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు కే.శ్రీనివాసులు మాట్లాడుతూ భగత్‌సింగ్‌ చదువుతున్న రోజుల్లోనే జులియన్‌వాలాబాగ్‌ దుర్ఘటనతో చలించిపోయారని అన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం 23 సంవత్సరాలకే ప్రాణత్యాగం చేసి ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ నినాదాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేశారని అన్నారు. ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి శ్రీరాములు, ప్రతాప్‌, బాబయ్య, మునిస్వామి, చిన్న, చంటి, మల్లికార్జున, వీరేశ్‌, నాగరాజు, రోహిత్‌ తదితరులు పాల్గొన్నారు.

భగత్‌సింగ్‌ స్ఫూర్తితో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నగేష్‌ పిలుపునిచ్చారు. సుందరయ్య కూడలిలో కేక్‌ కట్‌ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హుస్సేన్‌, శంకర్‌, కిరణ్‌, భరత్‌, చింటూ, బాబి పవన్‌, నవీన్‌, మహేష్‌, మద్దయ్య తదితరులు పాల్గొన్నారు.


కర్నూలు(రూరల్‌): కర్నూలు మండలం బి.తాండ్ర పాడు గ్రామ సచివాలయంలో మంగళవారం విజ్ఞాన సేవాసమితి ఆధ్వర్యంలో భగత్‌సింగ్‌ జయంతిని నిర్వహిం చారు. ముఖ్య అతిథులుగా టీడీపీ నాయకులు గ్రామ సర్పంచు జయన్న, ఎంపీటీసీ సభ్యుడు మద్దిలేటి హాజరయ్యారు. భగత్‌సింగ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళర్పించారు. గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికు లకు దుస్తులను అందజేశారు. గ్రామ సెక్రటరీ శాంతన్న, విజ్ఞాన సేవాసమితి గౌరవసల హాదారుడు మాణిక్యంరెడ్డి, అద్యక్షుడు రామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి వి.సుంకన్న, రమణారెడ్డి, మద్దిలేటి, రమణ పాల్గొన్నారు.


కర్నూలు(అర్బన్‌): స్వాతంత్య్ర పోరాటాల్లో యువతకు స్ఫూర్తి భగత్‌ సింగ్‌ అని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాయలసీమ యూనివర్సిటీ అఽధ్యక్షుడు ప్రశాంత్‌ రెడ్డిపోగు అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో బీసీ కార్పొరేషన్‌ స్టేట్‌ డైరెక ్టర్‌ గౌతమ్‌తో కలిసి భ గత్‌ సింగ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ భారత దేశంలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన నాయకుడు భగత్‌సింగ్‌ అని అన్నారు.


ఆదోని(అగ్రికల్చర్‌): భగత్‌సింగ్‌ జయంతి వేడుకలను మంగళవారం డీఎస్‌ఎఫ్‌ నాయకులు ఘనంగా జరిపారు. ఆదోనిలో డీఎస్‌ఎఫ్‌ నాయకులు భగత్‌సింగ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డివిజన్‌ కార్యదర్శి రాజు మాట్లాడుతూ భగ్‌సింగ్‌ అడుగుజాడల్లో ప్రతి విద్యార్థి నడవాలన్నారు.


ఎమ్మిగనూరు టౌన్‌: స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్‌ 114వ జయంతిని పట్టణంలో ఘనంగా నిర్వహించారు. సీపీఐ కార్యాలయంలో ఏఐఎస్‌ఎఫ్‌ ఆద్వర్యంలో భగత్‌సింగ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ తాలుకా కార్యదర్శి పంపన్నగౌడ్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా సహాయ కార్యదర్శి విజేంద్ర, రామాంజినేయులు, అబ్దుల్‌ ఖాదర్‌, సమీర్‌ పాల్గొన్నారు. జనసేనపార్టీ కార్యాలయంలో జనసేన మండల అధికార ప్రతినిధి రాహుల్‌సాగర్‌, రాష్ట్ర చేనేత వికాస్‌ కార్యదర్శి రవిప్రకాష్‌ ఆధ్వర్యంలో భగత్‌సింగ్‌ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. డీవైఎఫ్‌ఐ, యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో భగత్‌సింగ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అలాగే వైష్ణవి జూనియర్‌ కళాశాలలో డీవైఎఫ్‌ఐ ఆద్వర్యంలో వివేకానంద స్వచ్చంధ సంస్థ సహకారంతో రక్తదానశిబిరం నిర్వహించారు. ఏఐఎస్‌ఏ ఆధ్వర్యంలో భగత్‌సింగ్‌ జయంతిని నిర్వహించారు. 

Updated Date - 2021-09-29T04:42:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising